ఇంగ్లీష్ అర్థం కావడం లేదని.. విద్యార్థి షాకింగ్ నిర్ణయం?
ఇలా చాక్లెట్ తిన్నంత ఈజీగా బలవంతంగా ప్రాణాలను తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అప్పుడప్పుడు ఎదుగుతున్న విద్యార్థులె ఎక్కువగా ఉండటం గమనార్హం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని లేదా టీచర్ చెప్పింది అర్థం కావడం లేదని.. చదవడం లేదు అన్న కారణంతో తల్లిదండ్రులు మందలించారని ఇలా చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కోకోళ్ల లుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.
ఇక్కడ కూడా ఇలాంటి తరహా కఠిన వెలుగు లోకి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం లో తనకు పాఠాలు అర్థం కావడం లేదు అని సదరు విద్యార్థి ఎంతగానో బాధపడ్డాడు. ఇలా ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో ఇతర విద్యార్థుల ముందు చులకన అవుతున్నానని ఆవేదన చెందాడు. చివరికి మనస్థాపనతో సాయి నిఖిల్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మేళా సంఘంలో జరిగింది. పదో తరగతి వరకు తెలుగులో చదివిన నిఖిల్ ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం లో చేరాడు. తనకు ఇంగ్లీష్ అంటే భయమని తండ్రితో చెప్పి బాధపడేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంగ్లీషులో పాఠాలు అర్థం కాకపోవడంతో చివరికి కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.