అయ్య బాబోయ్.. షాహిద్ ఆఫ్రిథి మంగమ్మ శపథం?

praveen
భారత దయాతి దేశమైన పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఏకంగా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ చేతిలో సొంత గడ్డ పైన ఘోర పరాభవాన్ని చవిచూసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అటు పాకిస్తాన్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే  అయితే ఇక పాకిస్తాన్ అటు ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అటు పాకిస్తాన్ జట్టులో ప్రక్షాళన మొదలుపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రమిజ్ రాజా ని కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది   అంతేకాకుండా ఏకంగా సెలక్షన్ కమిటీ లో కూడా అనూహ్యమైన మార్పులు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.  కొత్త సెలక్షన్ కమిటీ లో భాగంగా షాహిద్ ఆఫ్రిది ని చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక చేయడం గమనార్హం. ఇక అతనితోపాటు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ ఫేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కూడిన సెలక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు కాబోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చీఫ్ కలెక్టర్గా ఎంపిక కావడంపై మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది తొలిసారి స్పందించాడు. అంతేకాదు మీడియా ముందు మంగమ్మ శబథం చేయడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చీఫ్ సెలెక్టరుగా నా పదవీకాలం ముగిసేలోపు పాకిస్తాన్ క్రికెట్ టీం బెంచ్ ను కూడా బలోపేతం చేస్తాను. పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారు చేస్తాను అంటూ ఒక మంగమ్మ శపథం చేశాడు షాహిద్ ఆఫ్రిది. అయితే ఇప్పటికేఇంగ్లాండ్ టీమిండియా క్రికెట్ బోర్డులు గత కొద్దికాలంగా ఇదే ప్లాన్ అమలు చేస్తుండగా ఇక ఇప్పుడు షాహిద్ ఆఫ్రిది కూడా ఇలాంటి ప్లాన్ అమలు చేస్తాను అంటూ చెప్పడం పాత చింతకాయ పచ్చడిలా ఉందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: