సన్రైజర్స్ యజమానికి ప్రపోజల్.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ?
ఈ క్రమంలోనే కొంతమంది కావ్య మారన్ ను చూడటానికే అటు మ్యాచులు కూడా వీక్షిస్తూ ఉంటారు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక కావ్య మారన్ ఎక్కడైనా ఉంది అంటే చాలు ఇక ఆమె ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడూ కావ్య పేరు మరోసారి నెట్టింట్లో తెగచక్కర్లు కొడుతుంది ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో హైదరాబాద్ జట్టు యాజమాన్యం సన్రైజర్స్ ఈస్టర్న్ పేరిట ఒక టీంను కొనుగోలు చేసింది.
ఇందులో భాగంగా ఇటీవలే సన్రైజర్స్ జట్టు ఒక మ్యాచ్ లో తలబడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను కావ్య మారన్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే మ్యాచ్ ను చూడడానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం గమనార్హం. కావ్య మారాన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ఒక ఫ్లకార్డ్ ను ప్రదర్శిస్తూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ను సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.