IPL: ధోని కి ఇదే చివరి ఐపీఎలా..?
మరి కొద్ది రోజుల్లో ప్రసారం కాబోతున్న ఐపీఎల్ 16వ సీజనే ధోనీకి చివరి సీజన్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా ఎన్నోసార్లు ధోని ఐపీఎల్ రిటైర్డ్ పైన పలు వాక్యాలు చేయడం జరిగింది.. ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మహేంద్రసింగ్ ధోని ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇవన్నీ కేవలం ఆ వాస్తవం వార్తలే అన్నట్లుగా అభిమానులు కొట్టి పారేస్తున్నారు.. ఈ విషయంపై చాట్ జిపిటిని అడగగా అది ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేసింది.
చాట్ జీపిటి.. అనగా ఇది అచ్చం మనిషిలాగ ఆలోచిస్తూ కచ్చితత్వంలో సమాధానాలను ఇస్తూ ఉంటుంది.. ఇది తెలిపిన ప్రకారం రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయమని ధోని విషయంలో కూడా అంతే తన వద్ద ధోనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అతడి వ్యక్తిగత ఆలోచనలు ప్రణాళికలకు సంబంధించి అసలు సమాచారం తన దగ్గర లేదు అందువల్ల ధోని ఐపీఎల్లో 2023 తర్వాత రిటైర్డ్ అవుతారు లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాను.. ధోని రిటైర్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది కేవలం అతని ఫిట్నెస్ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుందని వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చాట్ జిపిటి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.