ఎర్రిపు : హీరోయిన్స్ అంటే వాటికేనా బాసు..!
స్టార్ సినిమాలో హీరోకి ఎంత బిల్డప్ ఉంటుందో హీరోయిన్ ను అంత తక్కువ చేసి చూపిస్తారు. దర్శకుడు రాసుకునే పాత్రని బట్టే కథానాయికల స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో వాళ్లకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. అయితే స్టార్ హీరోల సినిమాల్లోనే మరీ హీరోయిన్స్ కు అసలు ప్రాముఖ్యత లేకుండా పోతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల్లో హీరోయిన్స్ కేవలం గ్లామర్ షోకి మాత్రమే అన్నట్టుగా వస్తున్నాయి.
స్టార్ సినిమాల్లో కథానాయికలు కేవలం పాటల వరకే పరిమితం అవడం దురదృష్టమని చెప్పొచ్చు. ఏదో సినిమాకు కావాల్సిన గ్లామర్ మిస్ అవుతుందనే ఆలోచన తప్ప అసలు కథనాయికల పాత్రలకు ఒక తలా తోక లేకుండా చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలో హీరోయిన్స్ ఎంట్రీ ఉంటుంది కాని సడెన్ గా మాయమైపోతుంది. ఆ తర్వాత ఆమె గురించి చూపించడం కూడా మర్చిపోతారు. ఇక కొన్ని సినిమాల్లో కరెక్ట్ గా సాంగ్ వచ్చే టైం కు హీరోయిన్ వచ్చి హీరోతో రెండు డైలాగ్స్ వేస్తుంది.. కట్ చేస్తే నెక్స్ట్ పాట అందుకుంటారు.
ఈమధ్య కాలంలో తెలుగు సినిమా కథలు మారాయి.. ప్రేక్షకుల ఆలోచన ధోరణి ప్రకారం దర్శకులు కూడా కొత్త కథలతో వస్తున్నారు. అయితే ఎన్ని మార్చినా సరే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కు అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే రెండు మూడు సీన్సే కదా అని ఎవరినో ఒకరిని పెట్టడం కాదు స్టార్ హీరోయిన్స్ పెట్టడం వారిని ఇలా పాటలకే అంకితం చేయడంపై హీరోయిన్స్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. కేవలం హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లోనే కాదు కమర్షియల్ సినిమాల్లో కూడా హీరోయిన్స్ పై దర్శకులు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు.
స్టార్ సినిమాలతో పోల్చుకుంటే యువ హీరోల సినిమాల్లో కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు.. సినిమాలో వారిదే ప్రాముఖ్యం ఉండేలా సినిమాలు చేస్తున్నారు.