ఎర్రిపు : సోషల్ మీడియాలోనే పవర్ స్టార్ క్రేజ్..!

shami

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు సోషల్ మీడియా స్థంభించేలా హడావిడి ఉంటుంది. రెండేళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న పవర్ స్టార్ త్వరలో వకీల్ సాబ్ గా రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా రిలీజైంది. రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ పోస్టర్ ని బాగా హైలెట్ చేస్తూ వచ్చారు. వకీల్ సాబ్ పోస్టర్ గురించి 2 మిలియన్ ట్వీట్స్ అంటే 20 లక్షల దాకా ట్వీట్స్ వేసి ట్రెండ్ చేశారు.

 

అయితే పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇదేమి గొప్ప విషయం కాదు. ఈ విషయం పక్కన పెడితే పవన్ కు ఉన్న ఈ క్రేజ్ ఆయనకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఈ రకమైన భారీ క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఎందుకు అంత దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది కాని జన సైనికులకు నచ్చక సినిమా ఫ్లాప్ చేశారు. ఇక పాలిటిక్స్ లో పవన్ ఓటమి గురించి తెలిసిందే. తన మీటింగులకు వచ్చే జనాలని చూసి పవన్ తను పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తాడని అనుకున్నారు. కాని సీన్ ఏంటన్నది తెలిసిందే.  

 

ఇలా పవన్ అనగానే సోషల్ మీడియాలో హడావిడి చేయడం తప్ప అసలు రిజల్ట్ టైం లో మాత్రం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అని అర్ధమవుతుంది. చేతిలో మొబైల్ ఉంది.. రిలీజ్ అయిన పోస్టర్ ఉంది జస్ట్ అలా ఓ ట్వీట్ వేస్తే ట్రెండ్ అవుతుంది అన్నట్టుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ పోస్టర్ ను సూపర్ గా ప్రమోట్ చేశారు. ఇప్పుడు 2 మిలియన్ ట్వీట్స్ తో పోస్టర్ ను హిట్ చేసిన ఫ్యాన్స్ రేపు రిలీజ్ తర్వాత సినిమా తేడా కొట్టినా హిట్ చేస్తారో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: