హెరాల్డ్ సెటైర్ : కంగారు పడకండ్రా...! కరోనాకు మందు కనిపెట్టేశారు .. పంపిణీ కూడా ...!

ఓరి నాయనా కంగారు పడకండ్రా కరోనా కిరోనా అని. ఎంతమందికి ఈ కరోనా సోకితే మీకేంట్రా ఎందుకురా అంత కంగారు ...? ప్రపంచ దేశాల్లో దీనికి మందు లేకపోవచ్చు. అన్ని దేశాలు విలవిలలాడవచ్చు. అసలు భారత దేశం కూడా ఒకటే హైరానా పడవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఆ కంగారు పడక్కర్లేదు. అసలు ఈ లాక్ డౌన్ అవసరమే లేదు. జనాలంతా రోడ్లపై హాయిగా తిరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతిని కూడా కంట్రోల్ చేయగల వ్యక్తి, కొత్త లోకాన్ని కూడా సృష్టించగల సమర్ధుడు, ప్రపంచ స్థాయి నాయకుడు, రాజకీయాలను బొంగరం తిప్పినట్టు తిప్పగల మన సెంద్రన్న ఉన్నాడు. అసలు ఎప్పుడు ఏ విపత్తుని ఎలా వాడుకోవాలో మన సెంద్రన్న కు మాత్రమే తెలిసి విద్య. బాబు గారి మామూలు వ్యక్తా...? ఏదో ఆయన గ్రహచారం బాగోలేక మన రాష్ట్రంలో పుట్టాడు కానీ... అదే ఏ అమెరికాలోనో పుట్టి ఉంటే ప్రపంచాన్ని గడగడలాడించేవాడు. అమెరికాకు, ప్రపంచానికి కూడా ప్రెసిండెంట్ అయిపోయి ఉండేవాడు. 

 

 
అసలు ఇప్పుడు కరోనా అంటూ కంగారు పడిపోతున్నారు... మందు కనిపెట్టలేదు అని హైరానా పడిపోతున్నారు. కానీ, ఏ ఒక్కడూ దీనికి మందు కనిపెట్టమని బాబు గారిని అడగలేదు. అడిగి ఉంటే ఈ పతికి బాబు గారు ఎప్పుడో సైన్టిస్ట్ అవతారం కూడా ఎత్తేసి ఉండేవారు. ఎవరూ అడగలేదు కాబట్టి సైలెంట్ అయ్యారు. అయితే బాబు గారు మన ఆంధ్ర కరోనాతో తగలబడిపోతుంది...! ఆ జగన్ బాబు ఆ మంటలను ఆర్పకుండా ఫిడేలు వాయిస్తున్నాడు...! మీరే రావాలి మీరే కాపాడాలి ఈ జనాన్ని అసలు ఈ కరోనా అంతు చూడాలి. అని తెలుగు తమ్ముళ్లు ఒకటే హైరానా పడిపోతూ బాబు గారికి జూమ్ యాప్ నుంచి అదేపనిగా వీడియో కాలింగ్ చేసేస్తుంటే బాబు గారికి ఉన్న ఇమానం అంత ఇసాల హృదయంతో కరోనా మందు మన సిన బాబు లోకేశం సహాయంతో కనిపెట్టేసారు.

 


బాబు గారు కనిపెట్టిన మందు పెపంచ దేశాలకు అమ్ముకుంటే కోట్లాదిరూపాయల సొమ్ములు కురిసే అవకాశం ఉన్నా, చాలా పె...........ద్ద మనసుతో మన ఆంధ్ర పెజానీకంమీద బాబు గారికి, మన సినబాబు మాలోకం గారికి ఉన్న పేమతో ఉచితంగా పంపిణీ సెయ్యడం మొదలెట్టారు. ఛీ ఛీ అసలు నాకు సొమ్ములు ఎందుకు పది ఇరవై తరాలు తిన్నా, తరగని కోట్లాది రూపాయల సొమ్ములు చెదలపడుతుంటే ఇంకా నాకు డబ్బులు ఎందుకు అంటూ ఆంధ్ర పెజానీకం మీద ఉన్న పేమతో ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు మన బాబోరు. అసలు మన బాబు గారు ఆంధ్రలో పుట్టడం మన పాపం ..! సారీ సారీ బాబు గారి పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: