హెరాల్డ్ సెటైర్ : నేతల నోళ్ళను చంద్రబాబు ఎందుకు నొక్కేస్తున్నాడో తెలుసా ?

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. అదేమిటంటే కరోనా వైరస్ నియంత్రణలో విఫలమైన కేసీయార్, జగన్ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ అనే కొత్త నాటకం మొదలుపెట్టినట్లు ఆరోపించాడు. పార్టీ నేతలతో జూమ్  కాన్ఫరెన్సులో తెలంగాణా నేతలతో చంద్రబాబు మాట్లాడాడు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్లపై పార్టీలో బాగా చర్చ జరుగుతోంది.

ఇంతకాలం మంచి మిత్రులమని చెప్పుకున్న ఇద్దరు సిఎంలు కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని చంద్రబాబు అభిప్రాయపడ్డాడు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పోతిరెడ్డిపాడు స్కీమంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. రెండు రాష్ట్రాలు తీసుకునే ఏ నిర్ణయమై ఏపి, తెలంగాణా అభివృద్ధికి, ప్రజలకు మేలు చేసేదిగానే ఉండాలనే సొల్లు కామెంట్లు కూడా చేశాడు. తాజా వివాదంలో రెండు ప్రభుత్వాలు ఎలా ముందుకెళతాయో నాలుగు రోజులు చూసి తర్వాత మనం మాట్లాడుదాం అంటూ తేల్చేశాడు. అంటే చంద్రబాబు చేసిన తాజా కామెంట్లతో రెండు రాష్ట్రాల్లోని నేతల్లో ఎవరినీ పోతిరెడ్డిపాడు వివాదంపై మాట్లాడద్దని నోరు నొక్కేసినట్లే. ఇంతచేసినా ఎంఎల్సీ బిటెక్ రవి అయితే జగన్ జిందాబాద్ అన్నాడు.

చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వాలు ఎక్కడా విఫలం కాలేదు. ఏ తుపానో, వరదను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటే అర్ధముంది. అంతేకానీ కంటికి కనబడని వైరస్, మందేలేని వైరస్ ను అరికట్టడంలో విఫలం అవ్వడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు తల్లడిల్లిపోతుంటే ఇక మన సంగతి చెప్పేదేముంది ? ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు అనేక దేశాలు వైరస్ నియంత్రణలో దేశం తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ  అభినందిస్తున్న విషయం తెలిసిందే.

దేశంలో వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఏపి కూడా ఒకటని కేంద్రప్రభుత్వమే స్వయంగా చెప్పిన తర్వాత ఇక చంద్రబాబు ఏమి మాట్లాడితే మాత్రం ఏమిటి ఉపయోగం ? ఇక ప్రస్తుత విషయానికి వస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరందించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు. ఇందులో నాటకం ఏముందో చంద్రబాబుకే తెలియాలి. జగన్ దే నాటకం అయితే మరి జీవో ఎందుకు జారీ చేస్తాడు ? సుమారు 6300 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి ఎందుకు ఇస్తాడు ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదంలో చంద్రబాబు ఇరుక్కుపోయాడు. ప్రాజెక్టు కట్టాలంటే కేసీయార్ కు కోపం వస్తుంది. కేసీయార్ కు కోపం వస్తే చంద్రబాబు ఆస్తులకు ఇబ్బంది. అలాగే ఓటుకునోటు కేసులో కదలిక వస్తుందేమో అన్న భయం. సరే ప్రాజెక్టు నిర్మాణం వద్దంటే ఇక శాస్వతంగా పై ప్రాంతంలో పార్టీ భూస్ధాపితమైపోతోందనే టెన్షన్. అందుకనే ఈ విషయంలో తన అభిప్రాయం చెప్పే ధైర్యం లేక ఇద్దరు సిఎంలు నాటకాలాడుతున్నారంటూ తానొక కొత్త డ్రామా మొదలుపెట్టాడు. చూద్దాం కొత్త డ్రామా ఎంతకాలం సాగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: