సెటైర్: కరోనా ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలుసుకోండ్రా బాబు

కరోనా కరోనా అంటూ దేశమంతా ఒకటే రాగం ... ఒకటే పల్లవి అందుకుంది. బయటకి వెళ్లాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా అందరికీ కరోనా భయమే. ఎటు నుంచి ఎలా కరోనా కాటువేస్తుందో తెలియదు. రెండు నెలలుగా భయం భయంగా గడిపేస్తున్నారు జనాలు. ఓరి బాబోయ్ కరోనా వస్తుందో.. మమ్మల్ని చంపుతుందో తెలియదు కానీ, లేని పోనీ రూల్స్ పెట్టి చావగొడ్తున్నార్రో అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. అంతేనా లాక్ డౌన్ సడలింపులపై సోషల్ మీడియాలో కాస్త వెటకారంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని న్యాయమైన వెటకారపు ప్రశ్నలను అడుగుతున్నారు. వారి ప్రశ్నల్లో న్యాయం ఉందో లేదో ఒకసారి తేల్చేద్దామ్ .

 

1 కారులో ముగ్గురు ప్రయాణించవచ్చు. నాల్గవ వ్యక్తి కారెక్కితే అతనికి మాత్రమే కరోనా సంక్రమిస్తుంది.


2. టూవీలర్ పై వెనక కూర్చున్న వ్యక్తి మాత్రమే కరోనాకు ఆకర్షితుడౌతాడు. బైక్ తోలే వ్యక్తికి కరోనా సోకదు.


3. బస్సులో 30 మంది మాత్రమే ప్రయాణించాలి. 31 వ వ్యక్తి ఎక్కితే కరోనా వస్తుంది.


4. సాయంత్రం ఏడుగంటలకు కరోనా బయటికి వచ్చి, ఉదయం 7 గంటల వరకు అటు ఇటు బాగా తిరుగుతుంది. కావున మీరు ఆ సమయంలో బయటకు రాకూడదు


5. ఒకవేళ మీరు మద్యశాల నుండి మద్యం కొంటే కరోనా తప్పుగా భావించదు. కాని బార్   లో కూర్చుండి తాగితే కరోనా పట్టుకుంటుంది.


6. ఒకవేళ మీరు పాస్ తీసుకొని వివిధ జోన్లలో ప్రయాణించినా పరవాలేదు. కాని పాస్ లేకుండా ప్రయాణిస్తుంది. కొరోనా మిమ్మల్ని అమాంతం మింగేస్తుంది.

7. మీరు ఎక్కడి నుండైనా సామాన్లు కొంటే కరోనా ఏమిచేయదు. కాని కమర్షియల్  కాంప్లెక్స్ లలో, షాపింగ్ మాల్ లలో కరోనా మీకోసం కాచుకొని కూర్చుంది.


8. మాస్క్ లేకున్నా, రాజకీయ నాయకులను వారి అనుచరులను కరోనా తాకే ధైర్యం కూడా చేయదు. కాని సామాన్య మానవులను మాస్క్  లేకుండా చూసి అమాంతం మింగేస్తుంది. 


9. ఆదివారం నాడు బయటికి వెళ్ళకండి కరోనా చక్కర్లు కొడుతుంది. ఇతర రోజుల్లో అది సెలవుపై వెళ్తుంది.


10. అది దేవాలయాలు, మసీదులలో, చర్చ్ లలో, స్కూళ్ళలో  మీ కోసం ఎదురు చూస్తుంది. కాని ఫ్యాక్టరీలలో ఇతర పని ప్రదేశాల నుండి పారిపోతుంది. 


11. ఒకవేళ మీరు హోటల్ లో భోజనం చేస్తే కొరోనా తప్పకపట్టుకుంటుంది. కాని హోటల్ భోజనం ఇంటికి తీసుకెళ్ళి తింటే అది మిమ్మల్ని ఏమిచేయదు.


12. అది ధనవంతుల పెళ్ళిలకు ఎంతమంది వచ్చినా ఏమి అనదు. కాని పేదల పెళ్ళికి 50 కి మించి ఒక్కరు ఎక్కువొచ్చినా కరోనా రెచ్చిపోతది.


కావున జాగ్రత్తతో ఉండండి, కరోనాతో జీవించటం నేర్చుకోండి, మీ జాగ్రత్త మీరు పాటించండి ...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: