సెటైర్ : వాళ్లెక్కడ వీళ్ళెక్కడ అంటున్నవ్ ... ఇంతకీ నువ్వెక్కడ నాయనా ?
ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందా ఏంటి ? సోషల్ మీడియా లోకి వచ్చి అదే పనిగా ఏదేదో చెప్తున్నావ్ ? అందరి పైన తాను అంటించుకున్న బురదను చల్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. పోనీలే చంద్రబాబు 70 సంవత్సరాల పెద్దమనిషి కాబట్టి, భయమేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే, నేను కుర్రాడిని అని పదేపదే చెప్పుకుంటూ, కుదిరితే సైకిల్ పార్టీకి అర్జెంటుగా అధ్యక్షుడిని అయిపోవాలని చూస్తున్న నువ్వు కూడా ఇంట్లోనే ముసుగు తన్నావే ? అని పదే పదే నీ ప్రియమైన శత్రువులు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నా, ఉలకవు పలకవు ఏంటి కన్నా ?
ఇప్పుడేమో సోషల్ మీడియాలో వీరావేశంతో ఆ మంత్రి ఎక్కడ ? ఈ మంత్రి ఎక్కడ ? ఆ జగన్ ఎక్కడ అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కామెడీ చేస్తున్నవే ? ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు నాయనా ? ఏపీలో ఏ మంత్రి పని ఆ మంత్రి, ఏ అధికారి పని ఆ అధికారి చూసుకుంటున్నారు. ఇంకా నీకే ఏ పని పాట లేకుండా, పార్టీని గాలికి వదిలేసి పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటున్నావే ? ఇంతకీ నువ్వు ఏపీ కి ఎప్పుడు వస్తున్నావ్ చెప్పు ? సవాలక్ష రిపేర్లతో మూలనపడ్డ ఈ సైకిల్ ను రిపేరు చేయించి, రోడ్ ఎక్కించే పని చూడు. మరీ ఆలస్యం చేస్తే, తుప్పు పట్టి పోవడమే కాదు, తొక్కేందుకు కూడా పనికిరాదు అనే ఈ విషయాన్ని గుర్తుంచుకో నాయనా ?
ఇంతకీ నువ్వు పరాయి రాష్ట్రం నుంచి నీ పార్టీ అధికారంలోక తీసుకురావాలని, రాష్ట్రమంతా సైకిల్ తొక్కాలని ఉబలాట పడుతున్నావు గా కొంపతీసి సైకిల్ తొక్కే పని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి ? అనే సవాలక్ష సందేహాలు ఇక్కడ జనాల్లో ఉన్నాయి. ఇక్కడ మా రాష్ట్రంలో ఎవరి పని వారు చూసుకుంటున్నారు. నువ్వు అదే పనిగా వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ అని విసిగించమాకు... అంటూ జనాలు గట్టిగానే చెబుతున్నారు నీకు అర్థం అవుతోందా ?