సెటైర్ : ఏంటేంటి రాజు గారు పరిస్థితి ఈ విధంగా ఉందా అయ్యో పాపం ?
ఈయనతో పెద్ద తలనొప్పి వచ్చింది ఎందుకురా బాబు అని వైసీపీ వాళ్ళయినా ఆయనను సస్పెండ్ చేస్తున్నారా అంటే ఆ పనీ చేయడంలేదు.అలా అని రాజుగారు పార్టీకి రాజీనామా చేస్తున్నారా అంటే ఆ పనీ చేయడంలేదు. ఆయనతో పెద్ద తలనొప్పి వచ్చిందిరా బాబు అనుకుంటూ ఆయన్ను ఆ వైసీపీ వాళ్ళు భరిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో రాజుగారు ఎవరి తోడు లేకుండానే వెళ్లాల్సి వస్తోంది. అసలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాజు గారు పార్లమెంటరీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. రండి రాజు గారు రండి రండి అంటూ మీటింగ్ కు ముందు పిలిచారు.
ఆ తరువాత రాజు గారు సో సారి అండి, మీరు దయచేసి మీటింగ్ కు రావొద్దు అంటూ చెప్పేసి, తమ పని తాము నిర్వర్తించేసారు అధికారులు. ఇప్పుడు రాజుగారు ఒంటరి అయిపోయారు. ఇప్పుడు పార్టీ తనను ఇలా అవమానించిందని బాధ చెప్పుకునేందుకు అవకాశం లేకపోవడంతో తన బాధ ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వైసీపీలో ఈ సంగతి ఊహించిందే అయినా, బీజేపీ వాళ్లు కూడా రారండోయ్ రాజు గారు అంటూ రెడ్ కార్పెట్ వేస్తారా అనుకుంటే వాళ్లు కూడా పక్కన పెట్టేసినట్టుగా మాట్లాడుతుండటంతో, ఇక అటు బీజేపీ లోకి వెళ్ళలేక, ఇటు సొంత పార్టీ వైసీపీ వైపు చూడలేక పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తన ఇబ్బందిని తలచుకుని పదే పదే రాజుగారు తెగ హైరానా పడిపోతున్నారు.