హెరాల్డ్ సెటైర్ : ఈ విషయంలో ఇద్దరూ ఒకటే అనిపించుకున్నారా ?
అప్పట్లో తన పార్టీ నేతలు, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు సుమారు 251 మందిపై ఉన్న క్రిమినల్ కేసులను చంద్రబాబు ఎత్తేశాడు. న్యాయపరంగా కేసులు ఎత్తేయటం చెల్లదని తెలిసినా ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ కేసులను మాఫీ చేసేశాడు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ లాంటి చాలామందిపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. అయితే అప్పట్లో చంద్రబాబు చర్యను వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో ప్రశ్నించాడు. ఆళ్ళ పటీషన్ పై కోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం వేరే సంగతి. ఆ నోటీసుకు ప్రభుత్వం ఏమని సమాధానం చెప్పిందో కూడా ఎవరికీ తెలీదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోవటంతో కేసుల ఉపసంహరణను అందరు మరచిపోయారు.
ఐదేళ్ళు గడిచేసరికి సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఇపుడు అదే పనిచేస్తున్నాడు. తన మంత్రులు, ఎంపిలపై నమోదైన కేసులను ఎత్తేస్తున్నాడు. కొడాలినాని, మిథున్ రెడ్డి, అవినాష్ ినాెడ్డి, మితర్టులు పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. మాు. నిజానికి తెల్లరేరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంది. నిజానికి ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుల్లో కక్షసాధింపు కొద్ది అధికారపార్టీలు పెట్టేవి కొన్నుంటాయి. ప్రజాప్రతినిధుల హోదాల్లో అడ్డదిడ్డమైన పనుల్లో వేళ్ళు పెట్టి ఇరుక్కున్నపుడు నమోదయ్యే కేసులు కొన్నుంటాయి. ఇక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో నమోదయ్యే కేసులు కూడా ఉంటాయి. ఏ పద్దతిలో కేసు నమోదైనా కేసు కేసే కదా. తనపై అధికారపార్టీ అన్యాయంగా కేసు నమోదు చేసిందని సదరు ప్రజాప్రతినిధి నిరూపించుకోగలిగితే కోర్టు కేసులను కొట్టేస్తుంది. కక్షసాధింపుతో పెట్టిన కేసులు కూడా కోర్టుల్లో నిలవవు.