హెరాల్డ్ సెటైర్ : ఫిర్యాదు చేయటానికి కూడా చంద్రబాబు భయపడుతున్నాడా ?
చంద్రబాబు గోలను పక్కనపెట్టేస్తే తాజాగా ఇదే విషయమై టిడిపి ఎంఎల్ఏ వాసుపల్లి టిడిపికి రాజీనామా చేశాడు. దాంతో రెచ్చిపోయిన చంద్రబాబు పార్టీమారిన ఎంఎల్ఏపై నోటికొచ్చినట్లు మాట్లడాడు. దాంతో వాసుపల్లి కూడా రివర్సులో రెచ్చిపోయాడు. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారిన తనపై దమ్ముంటే చంద్రబాబు ఫిర్యాదు చేయాలంటూ సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. తనపై స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వాలంటూ చంద్రబాబుపై తొడగొట్టాడు. తనపై అనర్హత వేటు వేయించి ఉపఎన్నికలు జరిపించాలని కోరటమే ఆశ్చర్యంగా ఉంది.
తన నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరిగితే తనపై టిడిపి అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవాలంటూ సవాలు విసరటమే అసలైన ట్విస్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్ఏ చాలెంజ్ కు పార్టీ నుండి ఎవరు సమాధానమే చెప్పటంలేదు. నిజంగానే వైజాగ్ ని రాజధానిగా అక్కడి వాళ్ళు ఎవరు కోరుకోవటం లేదని చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే ఎంఎల్ఏ చాలెంజిని స్వీకరించచ్చు కదా. వెంటనే స్పీకర్ ను కలిసి వాసుపల్లి పై అనర్హత పిటిషన్ ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. అర్జంటుగా ఉపఎన్నికలు పెట్టించేసి టిడిపి అభ్యర్ధిని పోటిలోకి దింపేసి గెలిపించేసుకుంటే సరిపోతుంది.