సెటైర్ : ఆ పంచేంటి.. ఈ బొట్టేంటి ? కడుపు రగిలిపోతుంది తమ్ముళ్లూ ..!

ఈ జగన్ చివరకి ఎంతటి దుస్సాహసానికి వడిగట్టాడు. ఏంటి ?  అసలు ఆ పంచె, తిరునామంతో బిజెపి పెద్దలందరినీ బుట్టలో వేసేసుకున్నాడు. అసలు జగన్ కు హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదని ప్రచారం చేసి ఆయనపై బురద రాద్దామని నేను కాచుకుని కూర్చుని జగన్ పాపులారిటీ తగ్గిద్దామని చూస్తే.. నా ఎత్తులనే చిత్తు చేసేస్తాడా ? ఆ జగన్ మాత్రం కరుడుగట్టిన హిందువుగా పంచె కట్టుకుని, తిరునామం పెట్టుకుని ... అబ్బబ్బా  ఎంత అందంగా  ముస్తాబైపోయాడో చూస్తూనే రెండు కళ్ళు చాలడం లేదు. ఇప్పుడు ఆ జగన్ కొత్త అవతారం చూసి ఆ బీజేపీ వాళ్ళు తెగ ముచ్చట పడిపోతున్నారు. అనవసరంగా జగన్ ను తిట్టిపోసి ఎంత పెద్ద తప్పు చేసామో కదా ...! జగన్ కు ఎంత భక్తి ఉందో అంటూ మురిసి పోతున్నారు. అసలు ఏనాడైనా బాబోరు ఇంత అందంగా ముస్తాబైయ్యరా ? అంటూ కౌంటర్లు వేసేస్తున్నారు.

 అసలు ఈ ఐడియా జగన్ కు ఇచ్చింది ఎవరో కానీ, నాకు మాత్రం కడపు రగిలిపోతుంది. మొన్ననే బిజెపి వాళ్ళకి, జగన్ కు చెడిందని, నేను మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకుంటుంటే, ఇప్పుడు నోరెత్తకుండా చేసి పడేస్తారా ? అసలు ఎంత ధైర్యం ? ఇప్పుడు ఆ జగన్ పై విమర్శలు చేయాలంటే ఎలా కుదురుతుంది. రాక రాక, దొరక్క దొరక్క దొరికిన మంచి అవకాశాన్ని జగన్ పాడు చేసి పడేసాడు. నిన్నో, మొన్నో మా కులపు మంత్రి ఆ నాని నన్ను తిట్టిపోస్తూ ... ఏమయ్యా  బాబు నువ్వు ఎప్పుడైనా తిరుపతిలో గుండు కొట్టించుకున్నావా ? బూట్లు వేసుకుని మరీ పూజలో పాల్గొనే నువ్వు మాకు చెప్పేది ఏంటి ? అంటూ కాస్త గట్టిగానే తిట్టిపోశాడు.

 ఇప్పుడు జగన్ ఈ విధంగా కనిపించి నన్ను వెక్కిరిస్తాడా ? ఆయనకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు ?అసలు ఈ జగన్ ఉన్నట్టుండి ఇలా చేస్తే , నేను మా పార్టీ వాళ్ళు ఏం కావాలి ? ఇప్పటికే ఆ కమలం పార్టీ వాళ్ళు జగన్ ను తిట్టడం ఆపేసి పొగుడుతుంటే కడుపు మండిపోతుంది. కనీసం ఆ అమిత్ షా అయినా, ఈ జగన్ ను తిట్టి పోసి, నా కళ్ళల్లో ఆనందం కనపడేలా చేస్తారా అంటే..?  వాళ్లేమో అబ్బబ్బబ్బ జగనూ నువ్వు సుపరొయ్ ..! నువ్వు ఇరగదీసేస్తున్నావ్, అంటూ అమిత్ షా, మోడీ లు పొగిడేస్తుంటే మళ్ళీ కడుపు మండిపోతుంది. అసలు ఈ జగన్ ను పొగుడుతూ నన్ను దూరం పెడతారా . వాళ్ళ దృష్టిలో పడాలనే కదా నేను ఎంత హడావుడి చేస్తూ, ఆ జగన్ ని తిట్టి పోస్తూ, మిమ్మల్ని పొగుడుతుంటే నన్ను పట్టించుకోకుండా  ఏంటి ఈ దారుణం ? జగన్ ను చూస్తే నా కడుపు మళ్లీ మళ్లీ .. మళ్లీ మళ్లీ రగిలిపోతుంది తమ్ముళ్లూ...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: