సెటైర్ : ఎలా ఎలా...? అసలు జగన్ ను కంట్రోల్ చేయడం ఎలా ?
అసలు ప్రజలకు మంచి చేస్తే ఈ స్థాయిలో క్రేజ్ వస్తుందని ఊహించి ఉంటే, నేనెప్పుడో ఆ పథకాలను ప్రవేశపెట్టి ఉండేవాడిని. ఇప్పుడు పోయింది ఏముంది ? ఇప్పుడు ఆ జగన్ అమలు చేస్తున్న పథకాలు నావే అని బుకాయించేస్తే సరిపోతుంది కదా అన్నట్లుగా జగన్ అమలు చేస్తున్న ప్రతి పథకం నాది నాది అంటూ, అదేపనిగా పాఠం పాడుతున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ , కుయ్ కుయ్ అంటూ రోడ్లపై తిరుగుతూ, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్సులను తానెప్పుడో మూలానపడేస్తే ఇప్పుడు జగన్ మళ్ళీ రోడ్లపైకి వాటిని తిప్పుతూ, నన్నే వెటకారం చేస్తున్నాడనే బాధ ఎక్కువ కనిపిస్తోంది.
అసలు తక్కువ ప్రచారం చేసుకుంటూ, ఎక్కువ చేసుకోవడం ఏమిటి ? నా హయాంలో చేసింది పావలా అయినా, ఆయన పది రూపాయల ప్రచారం చేసుకున్నాను. అయినా తనను జనాలు నమ్మకుండా మోసం చేశారు. ఇప్పుడు ఈ జగన్ క్రేజ్ చూస్తుంటే, ముందు ముందు కూడా తనకు, తన వారసుడికి రాజకీయ భవిష్యత్తు ఉండేలా కనిపించడం లేదనే బాధ ఎక్కువ కనిపిస్తోంది. అందుకే తాను ఎన్నో తప్పులు చేశాను అని, ఇకపై మిమ్మల్ని పట్టుకునే వేలాడుతూ, పార్టీ నాయకులతో పదే పదే పశ్చాత్తాపం మాటలు మాట్లాడుతున్నారు. అసలు జగన్ భవిష్యత్తులో అయినా ఎదుర్కోలేరు అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉండబట్టే కదా ? నా మాటను కూడా లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆందోళన బాబొరిలో పెరిగిపోతోంది.
ఇప్పుడు జగన్ కు వచ్చిన క్రేజ్ అమాంతం తగ్గించాలి ...! అది ఎలా తగ్గించాలి ? ఎలా ఎలా తగ్గించాలి ? ఇంకెలా జగన్ స్పీడ్ కు బ్రేకులు వేయాలి ? ఎలా ఎలా అంటూ బాబోరు నిత్యం ఇలాగే ఆలోచిస్తూ కాలం వెళ్లదీస్తున్నారటగా ?