సెటైర్ : ఈ విధి ఉంది చూశారూ ..? అర్జెంటుగా కంట్రోల్ చేశాయాల్సిందే ?

ఈ వీధి ఉంది చూశారూ... అది మహా చెడ్డధమ్మా ! ఎవరికి ఎప్పుడు ఎలా ...... తీర్చాలో అలా తీర్చేస్తుంది. ఈ విధి రాత నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది అందుకే. ఇప్పుడు ఆ వీధి కూడా బాగా పగ పట్టినట్లుగా బాబు గారు వ్యవహారంలో మహా ఇబ్బంది పెట్టేస్తోంది. అసలే ప్రకృతిని కూడా కంట్రోల్ చేయగల మేధావి అయిన బాబు గారు ముందు కుప్పి గంతులు వేస్తూ, ఆడేసుకుంటున్నారు. అర్జెంటుగా ఈ విధిని కూడా కంట్రోల్ చేసే శక్తి సామర్ధ్యాల కోసం ఇప్పుడు గారు గూగుల్ లో సెర్చింగ్ లు చేసే పనిలో ఉన్నారు. అబ్బా.. ఇప్పుడు తగులుతున్న దెబ్బలు అలాంటివి ఇలాంటివా ? అన్నీ ఎదురు దెబ్బలే. ఏం చేస్తాం ? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని సరిపెట్టుకోవదమే అని తీరిగ్గా ఇంట్లో ఉంది బాధ పడిపోతుండడమే. అసలు ఈ వీధికి ఎంత పగ ఉంటే, ఇంతగా కక్ష తీర్చుకుంటుంది. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన నన్ను పక్కన పెట్టేసి, అసలు అనుభవమే లేని ఆ జగన్ కు అధికారం కట్టబెట్టింది.

అర్జెంటుగా మా కిట్టుతో చెప్పి ఈ విధిరాతను కూడా మార్చి రాసేయమని చెప్పాలి. నేను మా పార్టీ వొళ్ళు.. ఏది పట్టుకుంటే అది మసి అయిపోతుంది. సర్వ నాశనం చేసేస్తోంది. ఉండండి రా బాబు పార్టీలో అని నెత్తీ నోరు బాదుకుంటున్నా, ఇప్పుడు అందరూ వైసీపీలోకి క్యూ కట్టేస్తున్నారు. ఉన్న నాయకులందరూ అవినీతి మరకలు అంటించుకుంటే, కడగలేక ఎంత ఇబ్బంది పడుతున్నానో ఆ వీధికి ఏం తెలుసు. ఏదో ఖాళీగా ఉంటుంది కదా అని పార్కుస్థలం వాడుకుని, ముచ్చటపడి 18 టాయిలెట్లు కట్టుకున్న మా పార్టీ నాయకుడిపై కక్షగట్టి వాటిని కొల్లగొట్టిస్తారా ?  దిస్ ఈజ్ వెరీ దారుణం. మా అచ్చెన్న ఏదో మందుల కంపెనీలకు మేలు చేస్తే, అరెస్టు చేసి లోపల వేస్తారా ?

అబ్బా నేను కాబట్టి తట్టుకుంటున్నా, ఇన్ని ఎదురు దెబ్బలు మరెవరైనా అయితే తట్టుకోగలరా ? అసలు ఏపీలో ఇదంతా జరుగుతోందని నాకు ముందే తెలుసు. అందుకే ఎవరికి దొరక్కుండా హైదరాబాదులో ఉన్నాను. 18 స్టేలు తెచ్చుకుని మరి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. అయినా ఏంటి రాద్ధాంతం ?  ఎవరికి వారు నన్నూ.. నా కొడుకును తిట్టిపోస్తున్నారు. అసలు అన్ని పాపాలు నేనేం చేశాను ? ఆ విధి ఉంది చూశారూ అది  అలా రాయబట్టే కదా ..!  అందరూ నన్ను నా కొడుకును ఇలా ఆడిపోసుకుంటున్నారు. లాభం లేదు.. చూస్తూ ఊరుకుంటే జరగరానిది ఏదో జరిగిపోతోంది. అర్జెంటుగా ఈ విధిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అని ఇప్పుడు బాబు గారు బుల్లి మెదడులో ఆలోచనలు అయితే పుట్టవు కదా ? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: