సెటైర్ : ఏంటి రెడ్డి గారు మా సినబాబు ని వదలరా ?

సైరా పంచులు.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోయాయి. సినబాబు , పెద్దబాబు  ను లక్ష్యంగా చేసుకుని పంచుల మీద పంచులు పేలిపోతున్నాయి. తిరిగి ఆ పంచులకు ఘాటుగా రీ పంచులు వేద్దామంటే... అంతకుమించిన రీ రీ పంచులు పడిపోతాయేమో అన్న భయం సిన బాబు, పెద్ద బాబు లో ఎక్కువై పోవడంతో, సైలెంట్ అయిపోతున్నారు. అసలు సిన బాబు, పెద్ద బాబు ను ఆడుకోవడం అంటే, రెడ్డి గారికి మహా సరదా అయిపోయింది. సమయం ఉన్నా, లేకపోయినా, సందర్భం ఏదైనా, పంచ్ డైలాగులు మాత్రం దూసుకు వస్తూనే ఉంటున్నాయి. ఈ పంచ్ లను తట్టుకోవడం ఆశామాషి అయితే కాదు. ఎప్పుడూ రెడ్డి గారి విమర్శల బాణాలు, వ్యంగ్యాస్త్రాలుగా సినబాబు పెద్ద బాబు పై దూసుకు వస్తూనే ఉంటున్నాయి.

ప్రస్తుతం పెదబాబు అమరావతి వ్యవహారంపై పూర్తిగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ లో ఉంటూ జూమ్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే అందరూ ఏకిపారేస్తున్నారని, ఏపీకి వచ్చి ముందు మాట్లాడితే మంచిది అంటూ డైలాగులు వేస్తున్నారనే కోపంతో ఏపీకి వచ్చినా, మళ్లీ ఆ జూమ్ నే నమ్ముకున్నారు. ఇక్కడి నుంచే అందరూ ఉద్యమాలు, ఆందోళనలు చేయండి అంటూ.. జూమ్ లో సౌండ్ పెంచి మరీ ఆదేశాలు ఇస్తున్నారు.

ఈ బాబు గారికి పని ఏమి ఉండదు. ఇప్పుడు రోడ్లపైకి వస్తే మమ్మల్ని ఆ జగన్ గవర్నమెంట్ వాళ్ళు ఊరికే వదిలేస్తారా ఏంటి ? కేసులు పెట్టి లోపల కూడా వేసేస్తారు అనే భయం, ఆందోళన ఆ పార్టీ నాయకులు ఉన్నా, పెదబాబు గారు మాత్రం... రండి రోడ్ల మీదకి రండి, కొవ్వొత్తులు పట్టుకోండి నిరసనలు తెలియజేయండి అంటూ అదేపనిగా రెచ్చగొడుతూ రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే, అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతుందనే ఆందోళనతో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు అని సిన బాబు, పెద్ద బాబు అదేపనిగా అల్లరి చేయడంపై రెడ్డి గారు మళ్లీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
" బాబు నుండి అవినీతి ఇ అసమర్ధత అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయోభారంతో సంభవించే సహజ మరణం ను కూడా తను రియల్ ఎస్టేట్ అడ్డ అమరావతి లిస్టులో వేసే దుష్ప్రచారానికి దిగాడు. తండ్రి లాగే మాలోకం మతి  చెడిపోయింది. ఇంకెంతకాలం అవుట్ డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం ? " అంటూ సినబాబు పరువు మొత్తం తీసిపారేసాడు రెడ్డి గారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: