హెరాల్డ్ సెటైర్ : బీజేపి+జనసేన పరిస్దితి మరీ ఇంత ఘోరంగా ఉందా ?
మొదటిదేమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటున్నారు. ఇక రెండో ప్రశ్న ఏ పార్టీకి ఓట్లేస్తారు ? అని. రెండు ప్రశ్నలకు జనాలు మొదటిఛాయిస్ గా జగన్+వైసీపీకి ఓట్లేస్తే రెండో చాయిస్ గా చంద్రబాబు+టీడీపీని ఎంచుకున్నారు. మరి అధికారంలోకి వచ్చేస్తామని కలలుకంటున్న బీజేపి, జనసేన పరిస్ధితి ఏమిటి ? వారి తరపున సర్వే చేసిన ఇద్దరు నేతల గురించి జనాలు ఏమనుకుంటున్నారు ? పార్టీల విషయంలో 13 జిల్లాల్లో జరిగిన సర్వేలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో తప్ప ఇంకే జిల్లాలో కూడా బీజేపీకి 4 శాతం మద్దతు కనబడలేదు. ఇక మిత్రపక్షం జనసేనకు మద్దతుగా ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 7 శాతం, వైజాగ్ జిల్లాలో 6.90 శాతం మద్దతుగా నిలిచారు. మిగిలిన 10 జిల్లాల్లో సుమారు 4 శాతం మద్దతు మాత్రమే చెప్పారు. ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి జనాలు అసలు ఆలోచిస్తున్నట్లు కూడా లేదు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా 3.90 శాతం మద్దతు పలికారు. బీజేపీ నేతలైన దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణకు 1 శాతం జనాలు మద్దతుగా నిలవటమే విచిత్రం. ఎందుకంటే కన్నా అవుట్ డేటెడ్ నేతన్న విషయం అయినా 1 శాతం మద్దతు పలకటం విశేషమే. ఇక పురందేశ్వరికి కూడా 1.10 శాతం మంది జనాలు సిఎంగా చూడాలని కోరుకోవటమూ ఆశ్చర్యంగానే ఉంది. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును కాకుండా కన్నా, పురందేశ్వరిని తలచుకునే జనాలు కూడా ఉన్నారన్న విషయమే ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ బీజేపీ, జనసేనల్లో పోలిక చూసే కమలంపార్టీకన్నా జనసేనకే జనాల మద్దతు కాస్త ఎక్కువగా ఉన్న విషయం అర్ధమవుతోంది. సర్వే రిజల్టు ప్రకారం చూస్తే దొందు పార్టీలు దొందే అన్న విషయం స్పష్టమైపోతోంది.