హెరాల్డ్ సెటైర్ : ఈయన పిచ్చి పీక్సుకు చేరుకున్నట్లే ఉందిగా ?
పరమత సహనం పాటించాల్సిన అవసరం మనకందరికీ ఉందని ఒకవైపు చెబుతునే అదే సమయంలో క్రైస్తవ మత వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చాడు ఎంపి. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు హిందు ధర్మ సంస్ధలు అర్జంటుగా కోర్టులను ఆశ్రయించాలని కూడా సూచించారు. భారీ ఎత్తున ఫీజులను ఇచ్చుకోలేకపోయినా ఏదో కొంతవరకు ఫీజలను ఇచ్చుకోగలమని చెప్పాడు లేండి. రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎంపి తీవ్రమైన ఆరోపణలే చేశాడు. ప్రభుత్వ చర్యలను అరికట్టకపోతే తొందరలోనే ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతాన్ని జనాలందరూ ’యేసయ్యా మరియా తనయా...పూర్తి సంధ్యా ప్రవర్తతే’ అని చదువుకోవాల్సొస్తుందని కూడా గట్టిగానే హెచ్చరించాడు.
అంతా బాగానే ఉందికానీ అసలు రాష్ట్రంలో రామరాజ్యం ఎప్పుడున్నది అన్న విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పటికిప్పుడు హిందు ధర్మానికి వచ్చిన ముప్పేమిటో ఎవరికీ తెలియటం లేదు. ప్రభుత్వం మతమార్పిడులను ప్రోత్సహిస్తోందా అన్న విషయంలో కూడా తిరుగుబాటు ఎంపి ఎటువంటి సంఘటనలను, లేదా ఆధారాలను చూపలేదు. మనమందరం కడుతున్న ట్యాక్సులతో పరమతాలను ప్రోత్సహించటం ఏమిటన్న ఎంపి ప్రశ్న కూడా అర్ధం లేనిదే. ఎందుకంటే మక్కాకు వెళ్ళదలచుకున్న ముస్లిం మైనారిటిలకు ప్రభుత్వమే చాలాకాలంగా నిధులు అందిస్తున్నవిషయం తెలిసిందే. ఇదే విధంగా 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటిల కోసం రంజాన్ తోఫా అని, క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్తియన్లకు ప్రత్యేకంగా కొన్ని నిత్యావసరాలను అందించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే జెరూసలేంకు వెళ్ళే యాత్రీకులకు నిధుల సాయం చేసిన విషయం కూడా తెలిసిందే.