హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుపై విజయసాయి తాజా కామెంట్ ఏమిటో తెలుసా ?
ఐఐటి విద్యార్ధులతో చంద్రబాబు మాట్లాడుతూ తనను తాను చాలా ఎత్తులకు ఎదిగిన నేతగా ప్రొజెక్టు చేసుకున్నారు. 20 ఇళ్ళు కూడా లేని ఓ మారుమూల విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండే గ్రామంలో పుట్టిన తాను ఇంత ఎత్తుకు ఎదిగినపుడు మీరు మాత్రం ఎందుకు ఎదగలేరంటూ చంద్రబాబు వాళ్ళని ప్రశ్నించాడు. మామూలుగా అయితే విద్యార్ధులతో మాట్లాడేటపుడు వారిలో స్పూర్తి నింపేందుకు బాగా సక్సెస్ సాధించిన పారిశ్రామికవేత్తనో, క్లీన్ రికార్డున్న రాజకీయ నేతనో లేకపోతే మహాత్మా గాంధీ సిద్దాంతాలనో ఉదాహరణలుగా చెబుతారు. అంతేకానీ అందరు తనను ఆదర్శంగా తీసుకోమని తమకు తాము ఎవరు డప్పు కొట్టుకోరు. కానీ చంద్రబాబు చేసందిదే. చంద్రబాబు రాజకీయ ఎదుగుదల ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అందరికీ గుర్తుంది. చంద్రబాబు మీదున్నన్ని అవినీతి ఆరోపణలు, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను కొనుగోలు చేసిన చరిత్రున్న చంద్రబాబును విద్యార్ధులు స్పూర్తిగా తీసుకుంటే అంతే సంగతులు.
బహుశా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే విజయసాయి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును చెడుగుడు ఆడేసుకున్నాడు. అలాగే చంద్రబాబు చెప్పుకున్నట్లుగా ఏపికి నిజంగానే తన హయాంలో రూ .15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుంటే రాష్ట్రంలో నిరుద్యోగులే ఉండేవారు కాదని ఎద్దేవా చేశాడు. లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగ భృతి ఎందుకివ్వాల్సొచ్చిందో చంద్రబాబును జవాబు చెప్పమంటూ ఎంపి నిలదీశాడు. గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబు తన రిటైర్మెంట్ రోజులను గడిపేస్తున్నట్లు ఎంపి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవం జరిపితే కనీసం శుభాకాంక్షలు చెప్పాలని కూడా అనిపించలేదంటు ఎత్తిపోడిచారు.