హెరాల్డ్ సెటైర్ : అమరావతి ప్లేసులో చంద్రబాబుకు కొత్త సమస్య దొరికిందా ?

Vijaya
సమస్యంటే కొత్తగా వచ్చిదేమీ కాదు చంద్రబాబునాయుడు కాలం నాటిదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హాయాంలో జనాలను రెచ్చగొట్టడం ద్వారా పాత సమస్యనే చంద్రబాబు కొత్తగా భుజానికెత్తుకున్నారు. ఇంతకాలం అమరావతిని పట్టుకుని చంద్రబాబు ఊగలాడారు. అయితే ఆ సమస్యపై పార్టీ నేతల్లోనే పెద్దగా ఇంట్రస్టు కనబడలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాని చంద్రబాబు తాజాగా  ఇళ్ళ సమస్యను భుజానికెత్తుకున్నారు. అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య. పైగా దీని వల్ల పార్టీకి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాగా నెగిటివ్ వచ్చేసింది. ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు కొత్తగా మాస్టర్ ప్లాన్ వేశారు. అదేమిటంటే ఇళ్ళ సమస్యను ఎత్తుకోవటం. టిడ్కో ఇళ్ళ సమస్య అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య.



జగన్ సర్కార్ ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వలేదు. పైగ తన హయాంలో 6 లక్షల ఇళ్ళను  నిర్మించినా వాటిని కూడా పేదలకు జగన్ ఇవ్వలేదంటూ కొత్త గోల మొదలుపెట్టారు చంద్రబాబు. అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ ఉంది. అదేమిటంటే నిజంగానే టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్ళు నిర్మించేసుంటే మరి అధికారంలో ఉన్నపుడే చంద్రబాబు వాటిని పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదు ? అప్పట్లో సామూహిక గృహప్రవేశాలంటూ చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు కదా. మరి అదే నిజమైతే వాటి తాళాలను లబ్దిదారులకు ఎందుకు ఇచ్చేయలేదు ? అప్పట్లో పేదల కోసం నిర్మించిన ఇళ్ళను  చంద్రబాబే లబ్దిదారులకు ఇచ్చేసుంటే ఇఫుడు గోల చేసే అవసరమే ఉండేది కాదు కదా ?



ఈ సమస్యలకు వైసీపీ నేతలు చెబుతున్న జవాబులు గట్టిగానే ఉన్నాయి. అవేమిటంటే చంద్రబాబు హయాంలో లక్షల ఇళ్ళు నిర్మించారన్నది పూర్తిగా అబద్ధమట. కేవలం ప్రచారం కోసం, ఎన్నికల్లో లబ్దిపొందటం కోసమే ఇళ్ళు నిర్మించినట్లు చంద్రబాబు నాటకాలు ఆడినట్లు ఆరోపిస్తున్నారు.  నిజంగానే చంద్రబాబు హయాంలో అన్ని లక్షల ఇళ్ళు కట్టేసుంటే మరి లబ్దిదారులకు ఎందుకివ్వలేదనే ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో నుండి సమాధానాలు రావటం లేదు.  చంద్రబాబు హయాంలో మొదలై ఇళ్ళ నిర్మాణంలో కనీసం 50 వేలు కూడా నివాసయోగ్యం కాదంటున్నారు వైసీపీ నేతలు.  లక్షల సంఖ్యలో  ఇళ్ళను కట్టేసినట్లు చంద్రబాబు అండ్ కో అంటున్నారు. కట్టలేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మరి వీళ్ళద్దరి వాదనల్లో ఎవరిది కరెక్టు ?



ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా మధ్యలో ఇబ్బంది పడుతున్నది మాత్రం లబ్దిదారులే అన్నది వాస్తవం. చంద్రబాబు హయాంలో జరిగిన ఇళ్ళ నిర్మాణాలపై ప్రభుత్వం ఓ అధ్యయనం చేయించి ఉన్నతాధికారుల ద్వారా ఎందుకు వాస్తవ ప్రకటనలు చేయించటం లేదో అర్ధం కావటం లేదు. ఇళ్ళ నిర్మాణాలు జరగలేదు కాబట్టే జగన్ పేదలకు ఇంటి స్ధలాలు ఇస్తానని చెప్పారు. అయితే ఇదికాస్త హైకోర్టు వివాదంలో ఇరుక్కుపోయింది. కోర్టులో విచారణ తేలితే కానీ ఇళ్ళ పట్టాల పంపిణీ సాద్యంకాదు. అంటే చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్ళను కానీ జగన్ చెప్పినట్లు ఇంటి పట్టాలు కానీ పేదలకు ఇప్పట్లో అందే అవకాశం లేదని స్పష్టమైపోతోంది. మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాల్సిందే. తమ హయాంలో నిర్మించిన ఇళ్ళను పేదలు ఉద్యమాలు చేసి ఆక్రమించుకోవాలని  చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు ఎంతమంది స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: