హెరాల్ట్ సెటైర్ : చంద్రబాబుకు ట్రంప్, బైడెన్ ఫోన్లు చేశారటగా

Vijaya
చంద్రబాబునాయుడు మీద వైసీపీ వెటకారం మరీ ఎక్కువైపోయింది. అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు చంద్రబాబుకు ముడిపెట్టి వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఎకసెక్కాలడటం సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు, పోస్టల్ బ్యాలెట్ల వివాదం, ఈ విషయమై ట్రంపు కోర్టులో కేసువేయటం, ట్రంపు వేసిన కేసులపై డెమక్రాట్ అభ్యర్ధి  జో బైడెన్ ఆరా తీయటం లాంటి ఘటనలన్నీ అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయం  మాత్రం ఓ పట్టాన తేలలేదు. సరే అమెరికా గోలను పక్కన పెట్టేస్తే దాన్ని చంద్రబాబుకు ముడేసి ఎద్దేవా చేయటం మాత్రం బాగా హైలైట్ అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే వియసాయి తన ట్విట్టర్ హ్యాండిల్లో ‘బ్రేకింగ్ న్యూస్..... చంద్రబాబుకు పోటీపోటీగా ట్రంపు, బైడెన్ ఫోన్లు. తమ ఎన్నికల కమీషన్ను, సుప్రింకోర్టును ఎలా మ్యానేజ్ చేయాలనే విషయమై సంప్రదింపులు’ అంటూ ఎంపి ఓ ట్వీట్ పెట్టారు.




నిజానికి అమెరికాలో జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబుకు ఏమీ సంబంధం లేకున్నా ఎలక్షన్ కమీషన్ను, సుప్రింకోర్టును ఎలా మ్యానేజ్  చేయాలని సంప్రదించారంటూ చెప్పటమే ఎంపికి ఉన్న సూపర్ టైమింగ్ ఏమిటో చెప్పేస్తోంది. ఎలక్షన్ కమీషన్, న్యాయవ్యవస్ధను చంద్రబాబు బాగా మ్యానేజ్ చేయగలడనే ఆరోపణలకు కొదవైతే లేదు. ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితమంతా వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంతోనే సరిపోయిందంటు ఎద్దేవా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  హైకోర్టులోను, సుప్రింకోర్టులోను తన మనుషులను ముందు జాగ్రత్తగానే చంద్రబాబు జడ్జీలుగా నియమించుకున్నాడనే ఆరోపణలకు కొదవేలేదు.




తాజాగా జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి ఓ ఫిర్యాదు చేసిన  విషయం తెలిసందే. లేఖరూపంలో పంపిన ఫిర్యాదులో సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ తన అధికారాన్ని ఉపయోగించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలను ప్రభావితం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, తీర్పులిచ్చేట్లు రమణ ప్రభావితం చేస్తున్నట్లు చేసిన ఫిర్యాదులు దేశంలోనే సంచలనం సృష్టించాయి. జగన్ తన లేఖలో చేసిన ఫిర్యాదు కారణంగా దేశమంతా చంద్రబాబు గబ్బు పట్టేశాడు. ఇంతకాలం న్యాయవ్యవస్ధను చంద్రబాబు ఎంతలా ప్రభావితం చేశాడు, సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడనే విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది.




ఇక ఎన్నికల కమీషన్ వ్యవహారమైతే చెప్పనే అక్కర్లేదు. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మ్యానేజ్ చేసి స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో ఎంతలా ప్రభవితం చేస్తున్నాడనే విషయమై వైసీపీ నేతల ఆరోపణలపై జనాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రయోజనాలను రక్షించటం కోసమే నిమ్మగడ్డ ఎలక్షన్ కమీషనర్ గా పనిచేస్తున్నాడనే వైసీపీ నేతల ఆరోపణలు అందరికీ తెలిసిందే.  కరోనా వైరస్ పెద్దగా లేనపుడు అర్ధాంతరంగా ఎన్నికలను వాయిదా వేయటం, వేల కొద్దీ కేసులు నమోదవుతున్నపుడు ఎన్నికలను పెడతామని నిమ్మగడ్డ చెప్పటమంతా చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నాడనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకునే విజయసాయిరెడ్డి చంద్రబాబుకు ట్రంపు, బైడెన్ ఫోన్లు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ట్వీట్ లోని నేపధ్యం తెలియటంతో అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: