సెటైర్ : అచ్చెన్న ఏకు మేకయ్యేనా ? చినబాబు వణుకు నిజమేనా ?

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కొత్త కమిటీలతో కళకళలాడుతోంది. పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారికి, లేనివారికి, పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వారికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారికి, ఇలా అందరికీ పదవులను కట్టబెట్టేశారు. అగ్రవర్ణాల పార్టీ అని పదవులు కూడా బాబు సామాజిక వర్గం వారికి మాత్రమేనని, ఇలా ఎన్నో రకాలుగా టిడిపిపై విమర్శలు వచ్చేవి. అయితే ఆ ముద్ర నుంచి బయటపడేందుకు పార్టీని, బయటపడేసేందుకు,  మళ్లీ అధికారం దక్కించుకునేందుకు టిడిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జంబో కార్యవర్గాన్ని బాబు ప్రకటించేశారు. అందులో దాదాపు మూడు వంతులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ లకు కేటాయించారు.



 ఇక తెలుగుదేశం రథసారధిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్న కు అప్పజెప్పారు.ఇక అంతా అనుకున్నట్టు గానే అచ్చెన్న సారధ్యంలోని టిడిపి గతంతో పోలిస్తే యాక్టివ్ అవడమే, కాకుండా నిరంతరం పోరాటాలు చేసేందుకు సిద్ధమైపోతుంది. ఇదంతా పార్టీకి మంచి పరిణామమే అయినా, చంద్రబాబు దృష్టిలో మాత్రం ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా, ఇరుకున పెట్టే అంశంగా కనిపిస్తున్నట్టుగా పార్టీలో ఒకటే చర్చ. ఎందుకంటే అచ్చెన్న వంటి వారి స్పీడు తట్టుకోవడం చంద్రబాబు వల్ల కాని పని. అటువంటిది రానున్న రోజుల్లో చంద్రబాబు ఖచ్చితంగా తట్టుకోలేరు. అసలు తెలుగుదేశం పార్టీలో లోకేష్ ను సైతం పక్కకునెట్టి హవా చూపించేస్తారు అనే భయం చిన బాబు లోనూ ఎక్కువైపోతోంది. 



అందరూ అచ్చెన్న చుట్టే చేరితే, ఇకపై ఆయనకే భజన చేస్తే, తన చుట్టూ తిరిగే వారు ఎవరు ఉంటారు అని ఆందోళన అప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో తన సొంత కార్యవర్గం వేసుకున్నా, చినబాబు భయం ఆయనకు ఉందట. అందరూ అచ్చెన్న చుట్టూ చేరితే, తనను ఇక ఎవరూ పట్టించుకోరని, ఆయనతో తనను పోల్చి చూసి అవమానాలకు గురి చేస్తారనే భయం వెంటాడుతోంది. పోనీ అధ్యక్ష పదవి తీసుకున్న అచ్చెన్న గత అధ్యక్షుడు కళా వెంకట్రావు లాగా ప్రెస్ నోట్ లకు మాత్రమే పరిమితమై పోతారా అంటే, అలా ఉండే రకం కాదు. సాధారణ ఎమ్మెల్యేగా ఉండగానే అందరూ చూశారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కూడా ఉండడంతో, తనను మించి పోతారు అని భయం చిన బాబు లో తీవ్రంగా ఉంది. అసలు చినబాబు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అచ్చెన్న వంటి వారికి, పార్టీని అప్పజెప్పారు బాబు. కానీ ఇప్పుడు ఆయనే తనకు పోటీ వస్తారేమో అనే చినబాబు టెన్షన్ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: