హెరాల్డ్ సెటైర్ : మేయర్ కుర్చీని టీడీపీనే గెలుచుకోవాలట

Vijaya

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిసో తెలీకో ఒక్కోసారి భలే క్యామిడీ చేస్తుంటారు. తాజాగా అలాంటి కామిడినే చేయటంతో చదివిన వాళ్ళందరు భలే నవ్వుకున్నారు. ఇంతకీ ఆయన చేసిన క్యామిడి ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) కుర్చీనీ టీడీపీ గెలుచుకోవాలట.  జూమ్ కాన్ఫరెన్సులో చంద్రబాబు చెప్పిన మాటలు విన్న టీడీపీ తెలంగాణా  నేతలకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. జీహెచ్ఎంసీ మేయర్ కుర్చీ టీడీపీకి ఎలాగ వస్తుందంటే హైదరాబాద్ లో ఎకో సిస్టమ్ ను టీడీపీ వల్లే సాధ్యమైందట. అందుకనే జనాలంతా టీడీపీకి ఓట్లేసేయటానికి రెడీగా ఉన్నారట. ఇంతకీ ఎకో సిస్టమ్ అంటే ఏమిటయ్యా అంటే ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పలేదు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని అందుకోవటమే టార్గెట్ గా పెట్టుకుని డివిజన్లలోని నేతలందరు కలిసి గట్టిగా పనిచేస్తే కుర్చీ మాత్రం టీడీపీనే గెలుచుకుంటుందని చాల గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పేయటమే విచిత్రంగా ఉంది.




ఇపుడు హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్ మొత్తం అప్పట్లో టీడీపీ చేసిందేనట. శంషాబాద్ విమానాశ్రయం, సైబరాబాద్, ఔటర్ రింగురోడ్డు, నల్సార్ యూనివర్సిటి, జీనోమ్ వ్యాలీ లాంటి అనేక అంతర్జాతీయ సంస్ధలను తానే తెచ్చానని ఇప్పటికి ఓ లక్షసార్లన్నా చెప్పుంటారు చంద్రబాబు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలైంది, ప్రారంభం అయ్యిందంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అయితే ఇతరుల ఖ్యాతిని కూడా తన ఖాతాలో వేసేసుకోవటం చంద్రబాబుకు చాలా అలవాటు. ఇదే కాదు ఔటర్ రింగురోడ్డు నిర్మాణం కూడా అంతే.  అందరు  ఓఆర్ఆర్ గా పిలిచే రింగు రోడ్డు కూడా వైఎస్ హయాంలోనే జరిగింది. అందరికీ తెలిసిన విషయం అయినా సరే దాన్ని కూడా తనే కట్టేశానని చెప్పేసుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో కూడా తన కృషి ఫలితమే అని అప్పుడెప్పుడో చెప్పుకున్నారు. కానీ టీఆర్ఎస్ అగ్రనేతలు వాయించేసరికి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు.




కాబట్టి అప్పుడెప్పుడో తాను చేసిన డెవలప్మెంట్ ను ఇఫుడు జనాలకు చూపించి ఓట్లడగాలట. అంతా బాగానే ఉంది కానీ అసలు 150 డివిజన్లలో పోటీ చేసేందుకు పార్టీకి గట్టి అభ్యర్ధులు ఉన్నారా అన్నదే అసలైన పాయింట్. పోయిన జీహెచ్ఎంసి ఎన్నికల్లో  పోటీ చేసిన టీడీపీ ఒకే ఒక్క డివిజన్లో గెలిచింది. టీడీపీ ఆశాదీపం నారా లోకేష్ చాలా డివిజన్లలో ప్రచారం చేసినా ఎక్కడా గెలవలేదు. అప్పటితో పోల్చుకుంటే ఇఫ్పుడు పార్టీ ఇంకా దిగజారిపోయింది. ఏ పార్టీలో చేరలేని నేతలు మాత్రం  టీడీపీలోనే మిగిలిపోయారు.  ఇటువంటి నేతలను పెట్టుకుని జీహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచేసి మేయర్ కుర్చీని ఎక్కేయాలని చంద్రబాబు ఆదేశించటమంటే క్యామిడి కాకపోతే మరేమిటి ? మేయర్ పోస్టు దక్కించుకోవాలంటే కనీసంగా 75 డివిజన్లకు పైగా గెలుచుకోవాలి. గెలుచుకోవటం సంగతిని పక్కన పెట్టేసినా అసలు పోటీకి గట్టి అభ్యర్ధులు దొరికేదే డౌటనుమానం. పోనీలేండి ఎప్పుడూ సీరియస్ గా ఉండేకన్నా అప్పుడప్పుడు ఇలా క్యామిడి చేయటం అందరికీ మంచిదే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: