సెటైర్ : వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్ ! పేలిన గుడివాడ గన్

ఏమన్నా అన్నాం అంటే అన్నాం అనుకుంటారు కానీ.. గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఏంటో నిన్న గుడి వాడ సెంటర్ కి వచ్చి తొడ కొట్టిన వకీల్ సాబ్ కి అర్ధం కావడం లేదు. అసలు గుడివాడ ఫైర్ బ్రాండ్ కి వకీల్ సాబ్ కి అస్సలు విరోధమే లేదు. ఎప్పుడూ టీడీపీని, సెంద్ర బాబు .. సిన బాబు , ఉమా ఇలా కొంతమందిని అవకాశం దొరికినప్పుడు, అవకాశం కల్పించుకుని మరీ తిట్టిపోస్తూ ఉంటారు. ఇది సైకిల్ పార్టీకి కూడా కంగారు పెట్టించిన ఆయనతో తిట్లు తినడానికి అలవాటు పడిపోయారు. ఇక జనాలు కూడా తండ్రి కొడుకులను నాని ఎప్పుడు తిడతాడా ...పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని నాని నోటి నుంచి వచ్చే తిట్లను ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అయితే గియితే రోషం .. పౌరుషం సైకిల్ పార్టీ వోళ్ళకి ఉండాలి కానీ వకీల్ సాబ్ కి మాత్రం గట్టిగానే పొడుచుకొచ్చింది. 



అమాంతం గుడివాడ నడిబొద్దికి వెళ్లి మరీ ... నీ ఊరొచ్చా .. నీ ఇంటికొచ్చా .. నీ నట్టింటికి వచ్చా  అని బాలయ్య బాబు డైలాగు గుర్తు చేసుకుని ఆవేశంగా కొన్ని డైలాగులు పేల్చేసాడు. అవేంటి అంటే... ? " ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరు బూతులు తిడుతూ ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి ? నానియా ? వైసిపిలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడిలింగం. అనేక మంది నాని లలో ఒకరైన నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్ కు చెప్పండి. జగన్ రెడ్డి గారికి వకీల్ చెప్పాడని చెప్పండి. వచ్చే శాసనసభ సమావేశాల్లో గా నష్టపోయిన రైతులకు 35 వేల పరిహారం అందించకపోతే, జనసైనికుల తో కలిసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.


అలా అర్ధం పర్థం లేకుండా తిట్టిపోస్తే  అసలే ఫైర్ బ్రాండ్ నాని ఊరుకుంటాడా ? ఓ రేంజ్ లో ఉతికేసాడు. ప్యాకేజ్ స్టార్ అని, వకీల్ సాబ్ వార్నింగ్ ఇచ్చాడా ? ఆయన వకీల్ సాబ్ అనుకుంటున్నారని , కానీ ఆయనను జనాలు షకీలా సాబ్ అనుకుంటున్నారని నాని విమర్శించారు.మమ్మల్ని బోడిలింగాలు అంటున్నావ్ రెండు చోట్ల పోటీ చేసిన నువ్వే బోడి  లింగం అంటూ గట్టిగానే మాటల తూటాలు పేల్చాడు వైసీపీ ఫైర్ బ్రాండ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: