హెరాల్డ్ సెటైర్ : బాబాయ్ ని ఉతికి ఆరేసిన అమ్మాయ్

Vijaya
బాబాయ్ అశోక్ గజపతిరాజును కుళ్ళబొడిచే అవకాశం ఎక్కడ దొరికినా అమ్మాయి సంచైతా గజపతిరాజు ఏమాత్రం విడిపెట్టడం లేదు. పైగా తన బాబాయ్ ఎక్కడ దొరుకుతాడా అని వెయ్యికళ్ళతో టార్చిలైటు వేసి మరీ వెతుకుతున్నట్లుంది. తాజాగా టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ వర్ధంతి రోజున అశోక్ గజపతిరాజు ట్విట్టర్లో పెట్టిన పోస్టును పట్టుకుని సంచైత ఆయన్ను ఉతికి ఆరేసింది. రాజకీయసూత్రాలను, నైతిక విలువలతో పాటు ప్రజలిచ్చిన తీర్పును తన బాబాయ్ మంటకలిపేశాడంటూ రెచ్చిపోయింది. ఒకవ్యక్తిని హత్య చేసిన హంతకుడే తర్వాత సదరు మనిషి దూరమైపోయాడని చెప్పినట్లుందంటూ బాబాయ్ వ్యవహారంపై మండిపడింది. ఎన్టీయార్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని అశోక్ ట్విట్టర్లో నాలుగు మాటలు రాసి ఎన్టీయార్ ను తలచుకున్నారు. తనకు ఎన్టీయార్ ఆరాధ్య దైవమని అశోక్ చెప్పుకోవటాన్ని సంచైత ఎద్దేవాచేశారు.



పార్టీ పెట్టుకుని సొంతకాళ్ళమీద పార్టీని ఎన్టీయార్ అధికారంలోకి తెచ్చిన విషయాన్ని సంచైత గుర్తుచేశారు. అలాంటి ఎన్టీయార్ ను పదవిలో నుండి తప్పించి మరణానికి కారకులైన వారిలో చంద్రబాబునాయుడుతో పాటు అశోక్ కూడా ఒకరని మాన్సాస్ ఛైర్ పర్సన్ గుర్తుచేశారు. తనను అధికారంలో నుండి దింపేసి టీడీపీని చీల్చేసిన తర్వాత 25, ఆగస్టు, 1995న ఎన్టీయార్ పార్టీ నుండి ఐదుగురిని బహిష్కరిస్తు ఓ ప్రకటన జారీ చేశారు. తాజాగా సంచైత సదరు ప్రకటనను కూడా ట్విట్టర్ హ్యాండిల్ కు జతచేశారు.  అయితే సంచైత ఓ విషయాన్ని మరచిపోయారు. పదవిలో నుండి దింపేసి, మానసికంగా కృంగదీసి చివరకు మరణానికి ప్రధాన కారకుడిగా ప్రచారంలో ఉన్న చంద్రబాబే ఎన్టీయార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిస్తున్నారు.



ఇక్కడ అందరు గమనించాల్సిందేమంటే ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపటంలో ముఖ్యపాత్ర చంద్రబబుదే అయినా సహపాత్రదారులు కుటుంబసభ్యులే. ఎన్టీయార్ కు పుట్టిన సంతానమే ఆయన్ను పదవిలో నుండి దింపేసే కుట్రలో కీలక భాగస్తులైనపుడు ఇక పార్టీలోని మిగిలిన నేతల పాత్ర గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపేయటంలో కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు ఇలా..ఎవరిపాత్రను వారు సమర్ధవంతంగా పోషించారన్న విషయం యావత్ ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి సంచైత తన బాబాయ్ ను తప్పుపట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీలేదు. అయితే తప్పు తప్పే కాబట్టి సమయం దొరికింది కాబట్టే ట్విట్టర్లో బాబాయ్ ను ఉతికి ఆరేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: