హెరాల్డ్ సెటైర్ : కరోనా వ్యాక్సిన్..మందుబాబులకు పెద్ద షాకే

Vijaya
కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అనుకుంటున్న మందుబాబులకు ఈ వార్త పెద్ద షాక్ ఇస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అనుకుంటున్నవారు, లేకపోతే వేయించుకున్న వారు అంటే మందుబాబులు మాత్రం లిక్కర్ కు దూరంగా ఉండాలట. వ్యాక్సినేషన్ వేయించుకున్న రోజు నుండి కనీసం 45 రోజులు మందుకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా వ్యాక్సినేషన్ దారి వ్యాక్సినేషన్ దే లిక్కర్ దారి లిక్కర్ దే అని మందు తాగేస్తే ఉపయోగం లేకపోగా తీసుకున్న వ్యాక్సిన్ వికటించే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  



ఈనెల 16వ తేదీన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 4 లక్షలమంది వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ వేయించుకున్నవాళ్ళల్లో 580 మందికి సైడ్ ఎఫెక్టులు కనిపించాయి. వీళ్ళు కాకుండా ఏడుగురు ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు చనిపోయారు. ఆసుపత్రిలో చేరిన ఏడుగురిలో సైడ్ ఎపెక్టులు ఏమిటి ? చనిపోయిన ముగ్గురు ఏ కారణాలతో చనిపోయారు ? అనే అంశాలపై వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. అయితే చనిపోయిన వారుకానీ ఆసుపత్రిలో చేరిన వారుకానీ వ్యాక్సినేఫన్ సైడ్ ఎఫెక్టుల వల్ల కాదని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. వ్యాక్సినేఫన్ సైడ్ ఎఫెక్టు వల్ల కాకపోతే మరెందుకని చనిపోయారనేది పెద్ద ప్రశ్న.



ఈ నేపధ్యంలోనే డాక్టర్లు మందుబాబులకు పై సలహా ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే మందుబాబులు లిక్కర్ కు దూరంగా ఉంటేనే వ్యాక్సిన్ పనిచేస్తుందని హెచ్చరించారు. మద్యం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందట. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ వేయించుకుంటే 30 రోజుల్లో రెండు డోసులు తీసుకోవాలంటున్నారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని డాక్టర్లంటున్నారు. రెండోడోసు తీసుకున్న 15 రోజుల తర్వాత శరీరంలో యాంటీ బాడీస్ వృద్దిచెందుతాయట. యాంటీబాడీస్ వృద్దిచెందితే కానీ కరోనా వైరస్ ను తట్టుకునే శక్త రాదట. మరటవంటపుడు ఒకవైపు లిక్కర్ తీసుకుని మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవటం వల్ల ఉపయోగం ఉండకపోగా రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చేస్తున్న హెచ్చరికలు మందుబాబుల చెవికెక్కుతాయా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: