హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

Vijaya
మత రాజకీయాలు అయిపోయాయి. మత మార్పిళ్ళంటు బీజేపీ నేతలు గోల గోల చేశారు. తర్వాత దేవాలయాలపై వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలతో శృతి కలిపారు. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం అంటూ రథయాత్రన్నారు. పంచాయితి ఎన్నికల కారణంగా దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇపుడు బీజేపీ వాళ్ళకు రాజకీయ నినాదాలేవీ కనబడలేదు. అందుకనే హఠాత్తుగా కుల రాజకీయాలు మొదలుపెట్టేశారు. అందులోను ఆ కులం  ఈ కులమంటే లాభం లేదనుకుని ఏకంగా బీసీలను భుజాన మోసే కార్యక్రమానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భుజానికెత్తుకున్నారు.




మీడియా సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ ఓ బీసీని ముఖ్యమంత్రిగా చేసే ధైర్యం బీజేపీకి ఉందంటూ ప్రకటించారు. మరి ఇదే ధైర్యం చంద్రబాబునాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటూ చాలెంజ్ చేశారు. ఎందుకంటే వీర్రాజు కాపు నేత అయ్యుండి కూడా బీసీలను ఎందుకు భుజాన మోసే కార్యక్రమం పెట్టుకున్నారు ? ఎందుకంటే సమాజంలో అతిపెద్ద సామాజికవర్గం బీసీలన్న విషయం అందరికీ తెలిసిందే. బీసీలు తర్వాత స్ధానంలో ఉన్న కాపులను  రాజకీయంగా ఏకం చేయాలనే ప్రయత్నాలు ఎప్పటినుండో జరగుతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు పెయిలవుతునే ఉన్నాయి.




వీర్రాజుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కాపు నేతే. అంటే రెండు పార్టీల చీఫులు కాపులే కాబట్టి బీసీలను కూడా తమతో చేర్చుకుంటే అధికారం తమదే అనే భ్రమల్లో ఉన్నట్లున్నారు వీర్రాజు. బీసీని ముఖ్యమంత్రి చేస్తారా ? అన్న ప్రశ్నేలోనే డొల్లతనం కనబడుతోంది. ఎందుకంటే ప్రాంతీయపార్టీలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీల అధినేతలే ముఖ్యమంత్రులవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. బీసీని ముఖ్యమంత్రి చేసే ధైర్యం బీజేపీకి ఉందని చెప్పిందే నిజమైతే దేశంలో వాళ్ళపార్టీల పాలిత రాష్ట్రాల్లో సీఎం పదవుల్లో ఎంతమంది బీసీలున్నారో వీర్రాజు చెబితే బాగుంటుంది. ముందు సీఎంలుగా అందరినీ బీసీలను మార్చేసి తర్వాత మాట్లాడాలి. మొత్తానికి రాజకీయంగా ఏదో కంపు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టే ఇపుడు బీసీ ముఖ్యమంత్రనే నినాదాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: