హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

Vijaya
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. లేని అధికారాలాను చేతిలోకి తీసుకుని పెత్తనం చెలాయించాలని చూడటం తప్పని తెలిసినా నిమ్మగడ్డ తన పద్దతిని మార్చుకోవటం లేదు. అందుకనే హైకోర్టు నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టేసి పెద్ద షాకే ఇచ్చింది. మొన్నటికి మొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంట్లో నుండి అడుగు బయటపెట్టేందుకు లేదని, మీడియాతో మాట్లాడేందుకు లేదంటు పిచ్చి ఆదేశాలు జారీచేశారు నిమ్మగడ్డ. అయితే మంత్రి కోర్టును ఆశ్రయించటంతో నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లవని తీర్పు చెప్పింది. మంత్రి వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే హక్కు కమీషనర్ కు లేదని కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది.  



అయితే నాలుగు రోజుల తర్వాత ఇటువంటి ఆదేశాలనే నిమ్మగడ్డ మరో మంత్రి కొడాలి నాని విషయంలో కూడా జారీ చేశారు. దాంతో ఈ మంత్రి కూడా నిమ్మగడ్డ ఆదేశాలను చాలెంజ్ చేస్తు కోర్టుకెక్కారు. రెండువైపుల వాదనలు విన్న తర్వాత న్యాయస్ధానం నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టేసింది. వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే అధికారం నిమ్మగడ్డకు లేదని చెప్పేసింది. ఎన్నికల ప్రక్రియ వరకే నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి కాని ఇతరత్రా అంశాల్లో నిమ్మగడ్డ జారీ చేసే ఆదేశాలు చెల్లవని స్పష్టంగా తేల్చి చెప్పేసింది. కొడాలి పై కేసు నమోదు చేయాలని కూడా నిమ్మగడ్డ కృష్ణాజిల్లా ఎస్పీని ఆదేశించటం చాలా విచిత్రంగా ఉంది. అంటే తాను ఏమి ఆదేశాలిస్తే అదంతా పాటించాల్సిందే అన్న పిచ్చి భ్రమలో నిమ్మగడ్డ ఉన్న విషయం అర్ధమైపోతోంది.



ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో ప్రతి చిన్న విషయానికి కోర్టుకెక్కిన నిమ్మగడ్డ తాను ఏమి చేసినా న్యాయస్ధానాలు మద్దతు ఇస్తాయని అనుకున్నట్లున్నారు. అందుకనే మంత్రులపైన కూడా  చిత్ర విచిత్రమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటువంటి ఆదేశాలు చెల్లవని కోర్టులు కూడా షాకుల మీద షాకులిస్తున్నాయి. దాంతో నిమ్మగడ్డ పూర్తి డిఫెన్సులో పడిపోయారు. ఏదో జిల్లాల్లోని అధికారుల మీద ఎన్నికల కోడ్ పేరుతో పెత్తనం చెలాయించినట్లుగా మంత్రులపైన కూడా పెత్తనం చేద్దామని అనుకున్నట్లున్నారు. అదికాస్త కోర్టు జోక్యం కారణంగా రివర్సులో బెడిసికొడుతోందిపుడు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: