హెరాల్డ్ సెటైర్ : నేతలే టీడీపీ కొంప ముంచేశారా ?
చివరకు నేతల మధ్య గొడవలు కాస్త సామాజికవర్గాల మధ్య గొడవలుగా తయారైంది. బోండా ఏమో కాపు సామాజికవర్గం నేత అయితే ఎంపి కమ్మ సామాజికవర్గం నేత. అయితే బోండాకు బుద్ధా, నాగూల్ అండగా నిలవటంతో పార్టీలో గొడవ తారాస్ధాయికి చేరుకుంది. చివరకు ఆ గొడవలు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధుల గెలుపుపై పడింది. అభ్యర్ధుల తరపున ప్రచారం చేసిన చంద్రబాబుతో కలిసి పనిచేయటానికి కూడా పై ముగ్గురు నేతలు ఇష్టపడలేదు. దాంతో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. చివరకు నేతల మధ్య పెరిగిపోయిన గొడవలే పార్టీ పుట్టిముంచాయి.
అసలు గెలుపు అవకాశాలు లేని విజయవాడ కార్పొరేషన్లో ఏకంగా మేయర్ అభ్యర్ధి ఎంపిక అంశంతోనే పార్టీలో ముసలం పుట్టింది. ఎంపి కూతురు కేశినేని నాని కూతురు శ్వేతను చంద్రబాబు ప్రకటించటాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీ అభ్యర్ధుల విజయానికి పెద్దగా కృషి చేయలేదు. మేయర్ అభ్యర్ధి అంశాన్ని పక్కనపెట్టేసి అందరు కలిసికట్టుగా గెలుపు కోసం పనిచేసుంటే మరో నాలుగు డివిజన్లలో గెలిచేదేమో. గెలుపు అవకాశాలను చేజేతులారా పోగొట్టుకున్న టీడీపీ నేతలు ఇపుడు తీరిగ్గా బాధపడుతున్నారు. మొత్తంమీద టీడీపీ నేతలే పార్టీ కొంపముంచేసిన విషయం స్పష్టంగా బయటపడింది.