హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

Vijaya
అవును గెలవకుండానే అభ్యర్ధి పనబాక లక్ష్మి తెలుగుదేశంపార్టీలో రికార్డు బ్రేక్ చేశారు. ఆమె చేసిన రికార్డు ఏమిటంటే రెండోసారి పోటీచేయటమే. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు టీడీపీ తరపున ఏ అభ్యర్ధి కూడా రెండోసారి తిరుపతి లోక్ సభలో పోటీ చేయలేదు. ఈ విధంగా చూస్తే పనబాక రెండోసారి పోటీచేయటమే రికార్డు బ్రేక అన్నట్లుగా ఎల్లోమీడియా టీడీపీ+పనబాకను ఆకాశానికి ఎత్తేస్తోంది. ఎలాగైనా టీడీపీని ఉపఎన్నికలో గెలిపించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఎల్లోమీడియా టీడీపీ మైనస్ లను ప్రస్తావిస్తునే వాటిని అధిగమిస్తున్న కారణంగా ఫలితాలు తారుమారవుతాయని ఆశపడుతోంది.



ఉపఎన్నికలో గెలవటానికి చంద్రబాబునాయుడు బ్రహ్మాండమైన వ్యూహాలు పన్నుతున్నారని, అధిష్ఠానం రచించినట్లు ప్రణాళికలను నేతలు, శ్రేణులు చివరికంటా పోరాడితే  పనబాక గెలుస్తారన్నట్లుగా జోస్యం కూడా చెప్పింది. నిజానికి ఎల్లోమీడియానే అంగీకరించినట్లు 1984 తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందేలేదు. పేరుకు చంద్రబాబు సొంజ జిల్లానే అయినా ఫార్టీ ఇయర్స్ ఇంస్ట్రీకి అసలు ఈ నియోజకవర్గంలో పట్టేలేదు. టీడీపీకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపటమే. పోటీచేసిన అభ్యర్ధులు కూడా ఇలా పోటీచేసి ఓడిపోగానే అలా మాయమైపోయారు. దాంతో ఎంపి అభ్యర్ధులకు, నేతలు+క్యాడర్ కు మధ్య సంబంధాలు లేకుండాపోయాయి. దాంతో ఎవరు పోటీచేసినా ఓడిపోవటమే.



మొదటిసారి చివరిసారిగా చింతామోహన్ టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి మారిపోయారు. 1989లో మురుగయ్య, 1991లో పట్నం సుబ్బయ్య, 1996లొ గాలి రాజశ్రీ, 1998లో ఎన్ శివప్రసాద్, 2009లో వర్లరామయ్య, 2014లో పనబాక లక్ష్మి పోటీచేశారు. అంటే ఇంతకుముందు వరకు పోటీచేసిన ఏ నేత కూడా రెండోసారికి అడ్రస్ లేరు. ఒక్క పనబాక మాత్రమే ఇపుడు రెండోసారి పోటీలోకి దిగారు. నిజానికి ఈమెకు కూడా పోటీచేయటం ఏమాత్రం ఇష్టంలేదట. ఎలాగూ ఓడిపోయే సీటులో పోటీ చేయటం ఏమిటని పనబాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు గట్టిగా పట్టుబట్టి పోటీలోకి దింపిన కారణంగా అన్యమనస్కంగానే పోటీలోకి దిగినట్లు ప్రచారంలో ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: