హెరాల్డ్ సెటైర్:తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వింత...?
దీని వలన చాలామంది నేతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి విషయంలో కొన్ని కొన్ని అంశాలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్ర అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ ఉన్న నేతలు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు అనే అభిప్రాయం కూడా ఉంది.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ దీనిని అనుకూలంగా మార్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తమను ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి విషయంలో పాదయాత్ర చేయవద్దు అని ఢిల్లీ వెళ్లి ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరు పాదయాత్ర చేసినా తమకు పర్వాలేదు అని చెబుతున్నారట కాంగ్రెస్ పార్టీ నేతలు.