హెరాల్డ్ సెటైర్: నాకెందుకులే అనుకుంటున్నా గంటా

Gullapally Venkatesh
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గంటా శ్రీనివాసరావు అసలు ఏం చేస్తారు ఏంటనే దానిపై ఎవరికి కూడా స్పష్టత రావడం లేదు. కానీ గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు అందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే కొన్ని అంశాల్లో గంటా శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ నేతలతో స్నేహం చేస్తున్నారనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ నేతలతో కూడా గంటా శ్రీనివాసరావు మంచి పరిచయాలు ఉన్నాయి.

 మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ తో కూడా చాలావరకు సన్నిహితంగా ఉంటున్నారని టాక్. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు నుంచి ఎటువంటి స్పష్టత కూడా రాలేదు.

అయితే త్వరలో గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి వెళ్లి పోవడానికి మార్గం సుగమం చేసుకున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి జనసేన పార్టీలోకి వెళ్ళాలని భావించిన వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన అంచనా వేసుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ముందుకు వెళ్ళడంతో రాష్ట్రంలో భవిష్యత్ లేదనే అభిప్రాయం కూడా కొంతమంది ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అని టాక్. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు జనసేన నాకెందుకులే అనుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: