హెరాల్డ్ సెటైర్ : వీళ్ళకు అఖిలపక్ష సమావేశం కావాలట

Vijaya
తాము అధికారంలో ఉన్నపుడేమో ప్రధాన ప్రతిపక్షపార్టీని పురుగును చూసినట్లు చూశారు. ప్రధాన ప్రతిపక్షనేతను అసలు లీడర్ గా గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు. సమస్య ఏదైనా అఖిలపక్ష సమావేశం పెట్టమని అడిగితే అసలు ప్రతిపక్షాలే దండగన్న ఫార్టీ ఇయర్స్ నేత ఇపుడు పదే పదే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలమహిమ వల్ల అధికారపక్షం ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రతిపక్షమేమో అధికారంలోకి వచ్చింది. దాంతో సీన్ మారిపోవటంతో పాటు డిమాండ్లు కూడా ఉల్టాగా వినబడుతున్నాయి. ఇదంతా ఎవరిని ఉద్దేశించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును కరెక్టే ఇదంతా చంద్రబాబునాయుడు గురించే. తాను సీఎంగా ఉన్నపుడు అప్పటి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టమని అడిగినా లెక్కేచేయలేదు. పైగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పిన మగానుబావుడు.



బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న విషయం చంద్రబాబు విషయంలో యాప్టుగా సరిపోతుంది. అప్పట్లో ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పిన మహానుబావుడు ఇపుడు ప్రతిదానికి అఖిలపక్ష సమావేశం పెట్టమని డిమాండ్ చేయటమే విచిత్రం. తాను అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలకు విలువిచ్చుంటే ఇప్పటి అధికారపార్టీ కూడా తన డిమాండుకు విలువిచ్చేదేమో. ఆరోజుల్లో జగన్ను ప్రతిపక్షనేతగా గుర్తించటానికి కూడా చంద్రబాబు అండ్ కో ఎవరు ఇష్టపడలేదు. అలాంటిది ఇపుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు అండ్ కో కు ఎందుకు మర్యాదిస్తాడు. అధికారంలో ఉన్నపుడు కళ్ళుమూసుకుపోయి పాలించినా, వ్యవహరించినా ఖర్మంచాలక ప్రతిపక్షాలోకి వస్తే పర్యవసానాలు ఎలాగుంటుంది అనేందుకు చంద్రబాబు ఉదంతమే ఉదాహరణ.



నిజానికి అప్పట్లో చంద్రబాబు అఖిలపక్ష సమావేశాలు పెట్టలేదని ఇపుడు తాను కూడా అదే దారిలో వెళతానని జగన్ అనుకోవటం తప్పే. అవసరాన్ని బట్టి  అఖిలపక్ష సమావేశం పెట్టి సలహాలు, సూచనలు తీసుకుంటే జగన్ కే మంచిది. చంద్రబాబు ఉదాహరణగా నిలిచిన చెడుసంప్రదాయాలను జగన్ ఎందుకు కంటిన్యు చేయాలి ? చంద్రబాబు పాలనకన్నా డిఫరెంటుగా పాలిస్తానని చెప్పుకున్న జగన్ అఖిలపక్ష సమావేశాల విషయంలో కూడా డిఫరెంటుగానే ఆలోచించ్చుకదా. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభంలో చేయాల్సింది రాజకీయాలు కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవటం. కాబట్టి అందరు కలిసికట్టుగా నడిస్తేనే కష్టాల్లో నుండి జనాలు బయటపడతారని జగన్ గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: