హెరాల్డ్ సెటైర్ : జగన్ కోసమే టీడీపీ మహానాడు నిర్వహిస్తోందా ?

Vijaya
ప్రతి ఏడాడి మే నెలలో జరిగే తెలుగుదేశంపార్టీ పండుగ  మహానాడు గురు, శుక్రవారాల్లో జరగబోతోంది. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రత్యక్షంగా కాకుండా డిజిటల్ పద్దతిలో రెండురోజులు నిర్వహించబోతున్నారు. పోయిన ఏడాది కూడా ఇలాగే జూమ్ యాప్ ద్వారానే మహానాడు జరిగింది. గురువారం నాడు ప్రారంభమయ్యే మహానాడులో మాట్లాడాల్సిన అంశాలను చంద్రబాబునాయుడు+పాలిట్ బ్యూరో ఫైనల్ చేసింది. ఫైనల్ చేసిన అంశాలను చూస్తే అసలు మహానాడు అవసరమా అనే డౌటు పెరిగిపోతోంది. ఎందుకంటే గడచిన రెండు సంవత్సరాలుగా ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడేసి రాజీనామా చేసేయాల్సిందే అని పదే పదే డిమాండ్లు చేశారు.



డైరెక్టుగా జగన్ కు సంబంధం లేని అంశాల్లో కూడా ప్రభుత్వానికే బురదపూసేస్తున్నారు. చంద్రబాబు దగ్గర నుండి కిందిస్ధాయి నేతవరకు జగన్ను తిట్టటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. చంద్రబాబుతో పాటు దేవినేని, అచ్చెన్న లాంటి నేతలైతే టైంటేబుల్ వేసుకుని మరీ జగన్ను తిడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇపుడు మహానాడులో కూడా ఇదే టైంటేబుల్ రెడీ అయిపోయింది. కరోనా నియంత్రణలో జగన్ విఫలం, జగన్ కక్ష రాజకీయాలు, జగన్ పెడుతున్న అక్రమ కేసులు, ప్రజాస్వామ్య హననం, జగన్ పాలనలో బాధలుపడుతున్న ప్రజలు, జగన్ అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం, చట్టాలను, న్యాయాలను జగన్ ఉల్లంఘిస్తుండటం, జగన్ రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టేయటం, జగన్ వల్ల పారిశ్రామికరంగం కుదేలైపోవటం, అమరవాతిలోని లక్షల కోట్ల సంపదను జగన్ నాశనంచేసేయటం.



ఇలాంటి అంశాలపైనే  మహానాడులో నేతల ప్రసంగాలు ఉండబోతున్నాయి. మరి ఇంతోటి దానికి ప్రత్యేకంగా మళ్ళీ మహానాడు ఎందుకనేదే ప్రశ్న. ఎందుకంటే మహానాడులో ఏవైతే అంశాలను అడ్డంపెట్టుకుని జగన్ను తిట్టబోతున్నారో గడచిన రెండేళ్ళుగా చేస్తున్నదదే.  సమయం, సందర్భం అవసరం లేకపోయినా నరేంద్రమోడి వైఫల్యాలను కూడా జగన్ ఖాతాలో వేసేసి అమ్మనాబూతులు తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు చంద్రబాబు అండ్ కో. ఎలాగూ రెండేళ్ళుగా చేస్తునే ఉన్నారు కాబట్టి ఇదే పనిచేయటానికి ప్రత్యేకంగా మళ్ళీ మహానాడు ఎందుకో అర్ధం కావటంలేదు. జగన్ మీద పెట్టే దృష్టిలో కనీసం సగం సమయం పార్టీ బలోపేతంపై పెడితే బాగుండేది. పార్టీలోని పాతతరం నేతలందరినీ పక్కనపెట్టేసి యువ రక్తాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చంద్రబాబు పూర్తిగా మరచిపోయారు. సో మహానాడు నిర్వహించటమే జగన్ను తిట్టడానికి అన్నట్లుగా ఉందిచూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: