ద్యావుడా: ఇటలీ ఇండియాకు ఒమిక్రాన్ ఎగుమతి చేస్తోందా..?
ఇందుకంటే.. ఇటీవల ఇటలీ నుంచి ఇండియాకు వచ్చే విమానాల్లో చాలా వరకూ కరోనా బాధితులు వస్తున్నారు. మొన్నటికి మొన్న ఇటలీ నుంచి ఇండియా వచ్చిన వారికి విమానాశ్రయంలో కరోనా టెస్టులు చేస్తే మొత్తం 290 మంది ప్రయాణికుల్లో 173 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే దాదాపు మూడు వంతుల ప్రయాణికులలో రెండొంతుల మందికి కరోనా వచ్చిందన్నమాట. మరి ఇంత మందికి కరోనా ఉన్నట్టు రుజువైతే.. అసలు వారిని ప్రయాణాలకు ఎలా అనుమతించారన్నది అసలు ప్రశ్న.
ఇలా ఒక్కరోజే కాదు.. నిన్న కూడా అలాగే జరిగింది. నిన్న ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో ఏకంగా 173మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. నిన్న మధ్యాహ్నం రోమ్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలోని 290 మంది ప్రయాణికుల్లో 173మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన సిబ్బంది.. వారిని అమృత్‌సర్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చేర్చారు. తీవ్రత లేని వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.
ఒమిక్రాన్ ముప్పు బాగా ఉన్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అందుకే.. ఆ దేశం నుంచి వచ్చేవారికి ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరిగా మారింది. ఈ వ్యవహారం చూస్తే ఎవరైనా విదేశాల నుంచి నాణ్యమైన వస్తువులు తెప్పించుకుంటారు.. కానీ ఇండియా విదేశాల నుంచి ఒమిక్రాన్ తెచ్చుకుందని సెటైర్లు వేసే ప్రమాదం చాలా ఉంది.