పవన్ కౌంటర్: ఏం జగన్.. భయపెడుతున్నారా..?
పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు కానీ.. డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలకు వివరించాలని పవన్ అంటున్నారు. డీజీపీ మార్పునకు కల కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే.. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవాడలో విజయవంతం అయినందుకే సవాంగ్ ను బదిలీ వేశారని భావించాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
గౌతమ్ సవాంగ్ బదిలీ ద్వారా జగన్ ఉద్యోగులను భయపెట్టదలచుకున్నారా.. అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందర్నీ హెచ్చరించి.. భయపెట్టాలనుకుంటున్నారా.. ఉద్యోగులను అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఉందా.. అదే ఈ ప్రభుత్వం చెప్పదలచుకుందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన తీరు చూస్తే గతంలో.. వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా తప్పించిన ఘటన గుర్తుకు వస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
నిజంగానే గౌతమ్ సవాంగ్ బదిలీ ఓ షాకింగ్ అని చెప్పుకోవాలి. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకూ ఉంది.. మొత్తం పోలీస్ శాఖకు బాస్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు.. అదే శాఖలో మరో చిన్న పోస్టులో పని చేయాల్సి రావడం బాధాకరమే.