ఆ ఒక్కసంగతి తేలితే బాబుకు బెయిల్ పక్కా?
చంద్రబాబు తరఫున లాయర్లు ముఖ్యంగా 17 ఏ అంశంపైనే తమ వాదనలు బలంగా వినిపించారు. నేరం ఎప్పుడు జరిగింది ముఖ్యం కాదని.. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ఇక్కడ ప్రాధాన్య అంశం అని వాదించారు. 2018 తర్వాత నమోదు అయ్యే ఎఫ్ఐఆర్ అన్నింటికి 17 ఏ వర్తిస్తుందని.. కేబినేట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు అయిందన్నారు. రాజకీయ ప్రతీకారంగానే కేసు నమోదు చేశారని ఆరోపించారు.
దీనికి సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ 2018లో జులై లో చట్ట సవరణ వచ్చింది. కేసు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైనా కేసు మూలాలు 2017లోనే ఉన్నాయి కాబట్టి ఈ కేసుకు 17 ఏ వర్తించదని పేర్కొన్నారు. ఆధారలన్నింటిని కోర్టు ముందు ఉంచాం అని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా తెలిపారు. డాక్యుమెంట్లు సమర్పించేందుకు తమకు సమయం కావాలని ముకుల్ రోహత్గీ కోరారు.
కేసు గురించి నిశితంగా పరిశీలించేందుకు దాదాపు 1400 డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. ఇప్పుడు జీఎస్టీ, ఈడీ శాఖలకు నోటీసులు జారీ చేస్తే.. వారు సరైన సమాధానం చెబితే చంద్రబాబు బుక్కవుతారు. ఇక్కడ చట్టంలో వచ్చిన వెసులుబాటు ముఖ్యమా.. అవినీతి జరిగినా ప్రతిపక్షాలను వేధించకూడదని తీసుకు వచ్చిన 17 ఏ ప్రకారం వీరిని శిక్షించకూడదా అనేది తేల్చే సందర్భం ఆసన్నమైంది. చూద్దాం ఏం జరుగుతుందో..