బాబు పీకకు చుట్టుకోనున్న మరిన్ని కేసులు?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కు బెయిల్ వస్తుందా.. లేదా సుప్రీం కోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తారా లేదా.. అనేదే ప్రస్తుత చర్చాంతా.. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇరు పక్షాల వాదలను విని కేసును వాయిదా వేసింది.


సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ.. సీఐడీ తరఫున ముకల్ రోహత్గీ వాదించారు. అయితే నిన్న వాదనలంతా 17 ఏ చుట్టూనే కొనసాగింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. గవర్నర్ అనుమతి లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు.


దీనిపై ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. 17ఏ తో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-ఏ వచ్చింది.  అంతకంటే ముందే 2017 లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అప్పుడే దీనిని సీబీఐ పరిశీలించింది. జీఎస్టీ విభాగం దర్యాప్తు ప్రారంభించిందన్నారు.


ఈ కేసు 17 ఏ దగ్గర ఆగిపోతే చంద్రబాబు బయటపడతారు. అలా కాకుండా నిశితంగా విచారణ జరిపితే కొత్తకోణాలు బయటకి వస్తాయి. 2018లో జీఎస్టీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసును వెలుగులోకి తీసుకువచ్చారు. కాబట్టి 17 ఏ  వర్తించదు అని ప్రభుత్వం వాదిస్తోంది. అప్పుడు జీఎస్టీ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీ చేస్తే వారు ఇచ్చే సమాధానంపై ఈ కేసు ఆధారపడి ఉంటుంది.


ఈ కేసులో చంద్రబాబు బయటపడితే ఇప్పుడు కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వచ్చింది. దీనిపై ఆయన ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బయటకు వస్తే ఇవన్నీ పక్కకి వెళ్తాయి. లేకుంటే అన్ని కేసులు చుట్టుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: