క‌ల చెదిరింది..చివ‌రికి అడ‌ల్ట్ సినిమాలు తీస్తు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

Paloji Vinay
ఆశ‌యం ఎంత బ‌ల‌మైన‌దైనా, కోరిక ఎంత ఇష్ట‌మైనా విధి ఆడే వింత నాట‌కంలో క‌ల క‌ల్ల‌లు కావాల్సిందే. ఆశ‌యం, ఆశ‌లు ఆవిరి అవ్వాల్సిందే. కానీ ఆ మలుపు ఏ గ‌మ్యానికి చేర్చుతుందో ఆ విధికే తెలియాలి. అలాంటి ప‌రిణామ‌మే ఓ వ్య‌క్తికి జ‌రిగింది. సాక‌ర్ ఆట‌లో వెలుగు వెలుగాల‌నుకున్న ఆ యువ‌కుడు ఇప్పుడు అడ‌ల్ట్ సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా ఎదిగి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్నాడు.
 అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీలో టాప్‌లో కొన‌సాగుతున్న డేనియల్‌ రెగినాల్డ్‌ మౌంటేయిన్ ఇంగ్లండ్‌ బ్రాక్‌నెల్‌లో 1984 జులై 18 న జ‌న్మించాడు. సాకర్‌ శకంలో అతని టైం మొదలైందనుకున్న స‌మ‌యంలో విధివశాత్తూ కాలికి గాయం అయ్యింది. మోకాలి గాయం కొన్ని నెలలపాటు వేధించ‌డంతో ఫుట్‌బాల్‌కు పనికిరాడనే ఉద్దేశంతో సౌత్‌ఆంప్టన్‌ అతన్ని ట్రీట్‌మెంట్‌కు అయ్యే డబ్బు ఇచ్చి టీం నుంచి ఉద్వాసన పలక‌డంతో పదహరేళ్ల వయసుకే ఫుట్‌బాల‌ర్ కావాలనే కల క‌ల్ల‌లుగా మారింది.

ఫుట్‌బాల్‌ రేపిన గాయం నుంచి తేరుకున్నాక కార్పెంటర్‌గా ఆరేళ్లపాటు పని చేశాడు డేనియ‌ల్‌. ఆ టైంలోనే.. ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా పరిచయ‌మైన అమ్మాయి పోర్న్ సినిమాల్లో న‌టించ‌మ‌ని చెప్ప‌డంతో ఆ దిశ‌గా అడుగులు వేశాడు. అడ‌ల్ట్ సినిమాల్లో అవ‌కాశాలు పెరుగుతున్నా కొద్ది.. ఆదాయంతో పాటు క్రేజ్ పెర‌గ‌డం మొద‌ల‌యింది. 24 సంవ‌త్స‌రాల‌కు లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చిన‌ డేనియ‌ల్ డానీ మౌంటెన్ పేరుతో అడ‌ల్ట్ ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. ఆ స్టార్ డ‌మ్‌తో సెల‌బ్రిటీలు డేటింగ్ చేశారు. పోర్న్ స్టార్‌లు ఎవా ఎంజెలినా, మియా మాల్కోవాలు డేనియ‌ల్ మాజీ భార్య‌లు. హాలీవుడ్ ప్ర‌ముఖులు జాసోన్ స్టాథ‌మ్‌, విన్నీ జోన్స్‌లు డేనియ‌ల్ మంచి మిత్రులు.

   ప్రస్తుతం అడల్ట్‌ ఫిల్మ్‌  స్టార్లలో హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్‌ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఒక‌డిగా ఉన్న 37 ఏళ్ల‌ డేనియల్‌ రెగినాల్డ్‌ అడల్ట్‌ సినిమాలతో ఏటా 1 మిలియన్‌ పౌండ్లకు పైనే ఆర్జిస్తున్నాడు. గ‌త‌ ఏడాదిలో తాజా రిపోర్ట్‌ ప్రకారం డేనియలే నెంబర్‌ వన్‌. ఇక హోటల్స్‌ బిజినెస్‌తో, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా-ఫిట్‌నెస్‌ కోచ్‌గా సంపాదన అదనంగా ఉంది.

ఇక అనుకోని వృత్తిలోకి దిగినప్పటికీ.. తాను అనుకున్న‌ గుర్తింపు మాత్రం దక్కలేదనే బాధ మాత్రం ఇప్పటికీ త‌న‌ను వేధిస్తోంద‌ని డేనియ‌ల్ అంటున్నాడు. త‌న‌ పిల్లల భవిష్యత్తును శాసించడం.. నిర్ణయించడం నా చేతుల్లో లేద‌ని కానీ, ఒక తండ్రిగా అడ‌ల్ట్ రంగంలో చేయ‌డం వ‌ద్ద‌ని నా కూతురికి  చెప్తా. కొడుక్కి మాత్రం ‘ధైర్యం చేయమ’ని ప్రొత్సహిస్తాన‌ని చెప్తున్నాడు డేనియ‌ల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: