స్వాతంత్ర్యమా పాడుకో : అజ్ఞానం మారదు..దేశం అలానే
ప్రశ్నించే పాట
సిరివెన్నెల పాట
సీతారాముడి ఆవేశం ఈ పాట
మా తూర్పు కవి రాసిన పాట
వింటూ వింటూ పొంగిపోయాడు
ఒకడు రాస్తూ రాస్తూ విలపించాడు ఒకడు
మొదటి వాడు కృష్ణవంశీ రెండో వాడు
సిరివెన్నెల
ఆ పాట
ఓ సినిమాకు ఆధారం
ఆ పాట నవ జీవన గమానాన్ని
మార్చేందుకు దిక్సూచి
అర్ధ శతాబ్దపు అజ్ఞానం అలానే ఉంది
మార్చడం బాధ్యత మార్పే ఓ చైతన్య గీతిక
ఈ దేశంలో అజ్ఞానం ఉంది..దశాబ్దాల అజ్ఞానం అని రాయాలి..శతాబ్దాల చీకటి ఉంది.. ఎవరు ఎవరికి? ఎవరు ఎవరి కోసం? ఇచ్చే కానుక, చేసే త్యాగం అన్నవి మన జీవితాలను ఎలా ప్రశ్నిస్తున్నాయి. ఒక్క పాట తో..నైరా శ్యంలో మీరు ఉండి, బాధ్యతలు అన్నవి పట్టకుండా మీరు ఉండి నిందించకండి నా దేశాన్ని అని చెబుతాడు..కవి.. మా తూర్పుకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆత్మ వినా శపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి స లాము చేద్దామా? లేదా స్వర్ణోత్సవం చేద్దామా?
అడవిలో తుపాకులు..పేలుతాయి..తూటాలు రాలుతాయి..ప్రాణాలూ పోతాయి..ఒక బాధ్యత లేని సమాజం నుంచి మనం ఏం కో రుకోగలం. ఎవరు ఎవరి కోసం చేయాలి పోరాటం. మనుషుల్లో ఉన్న కుట్ర లేదా కుళ్లూ లేదా మాలిన్యం పోకుండా అడవిలో చేసే పోరు ఏమయినా ఫలితం ఇస్తుందా అన్నది కవి భావం. ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం.. అవును!మీరు పోరాటం ఎంచుకోండి..యుద్ధం ఎంచుకోండి ..సిద్ధాంతాన్ని రాసుకోండి.. ప్రాణ త్యాగం విలువ తెలిసిన వారికే ప్రాణా లను అర్పించండి..ఆ అర్హత ఈ సమాజం నా దేశం అందుకున్న రోజు అమరులయిన వారికి ఆత్మ శాంతి...పోరుబాటలో ఉన్న వా రికి అదే గొప్ప కాను క.. మీరు వారికి ఈ పంద్రాగస్టున కానుకలు ఇవ్వగలరా? ఇస్తే ఇలాంటివే ఇవ్వండి.
మనకు కావాల్సింది కులాల తగువు..మతాల కలహం కాదు తలలర్పించడం ఎందుకు?వాటితో ప్రయోజనం లేదు కదా! మీరు ప్రయోజనం లేని పనులు ప్రజోపయోగం అని అనుకుంటే నేనేం చేయను అది మీ ఖర్మ అని అం టాడీ కవి.. సమూహ క్షేమం పట్ట ని చోటు నువ్వెందుకు నేనెందుకు అని నిలదీస్తాడీ కవి..ఇదంతా అజ్ఞానమే సర్.. సంస్కరణకు సాధ్యం అవుతుందో లేదో నా తర ఫు మీ తరఫు ప్రశ్న..ఈ అనాగరికానికీ,ఈ అంధ విశ్వాస ధో రణికీ..అమరుడంటే నక్సలైట్ ఒక్కరేనా..లేదా పోలీసు కూడానా!మరి! ఈ తగవు ఎవరు తీరుస్తారు.. వేకువా వైపా చీకటిలోకా ఈ ప్రయాణం చెప్ప మ్మా ఓ పవిత్ర భారతమా! గతి తోచని భారతమా అం టున్నాడీ కవి..ఇదంతా అజ్ఞానమే..తన ధైర్యాన్ని అడవికి ఇవ్వడం.. వెలుతురు తప్పుకు తిరగడం కూడా గతి తప్పడమే అన్నది కవి భావన.