అల్కాహాల్ మ్యూజియం.. ఎక్కుడుందో తెలుసా..?

Paloji Vinay
మ్యూజియంలో సాధార‌ణంగా పురాత‌న వ‌స్తువులు.. చారిత్ర‌క వ‌స్తువులు ఉంటాయ‌ని మ‌న‌కు తెలుసు. అలాగై సైన్స్‌కు సంబంధించిన‌వి కూడా ఉంటాయి. కానీ, మొట్ట‌మొద‌టి సారిగా అల్క‌హాల్ కోసం మ్యూజీయం నిర్మించారు. మందు తాగ‌డం కాదు మ‌ద్యం పుట్టు పూర్వొత్త‌రాలు ఈ మ్యూజీయంలో ఉన్నాయి. మద్యం తయారీ చరిత్రను తెలిపేందుకు తాజాగా గోవాలో ‘ఆల్కహాల్ మ్యూజియం’ ను ఏర్పాటు చేశారు. మూమూలుగానే గోవా అంటే గుర్తుకొచ్చేది బీచ్‌, మ‌ద్యం.


 ఈ మ్యూజియాన్ని నిర్మించింది కేవ‌లం మద్యం చరిత్రను తెలిపేందుకే కానీ.. మద్యం వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కాదు అని మ్యూజియ‌మ్ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌ర‌న్ కుడ్చ‌డ్క‌ర్  చెబుతున్నారు. ప్రపంచ చరిత్రలోనే మద్యం కాచే చరిత్రకు అంకితమిచ్చిన మొట్టమొదటి మ్యూజియం అని చెప్పారు నంద‌ర‌న్‌. ఈ మ్యూజియాన్ని 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్తర గోవా బీచ్ లో ఏర్పాటు చేశారు.  అలాగే పనాజీకి దాదాపు 10 కిమీ దూరంలో ఉంది ఈ అల్క‌హాల్ మ్యూజియం..



‘ఆల్ ఎబౌట్ ఆల్కహాల్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో ప్రసిద్ధి గాంచిన మద్యం ఫెని తయారీ విధానం గురించి ఉంటుంది.   ఈ మ్యూజియంలో 1950 కాలం నాటి ఫెని అంటే పులియబెట్టిన జీడిపప్పు లేదా కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్ బాటిళ్లు ఉన్నాయి. ఫెని డ్రింక్ సర్వింగ్ గ్లాస్‌లు, పాత చెక్క డిస్పెన్సర్‌లు, కొలిచే పరికరాలు క‌నిపిస్తాయి.



  గోవాలో జీడిపప్పుతో మద్యం తయారు చేసే కలను ప్రోత్సహించే లక్ష్యంతోనే వీటిని ప్రదర్శించామ‌ని  చెబుతున్నారు నిర్వ‌హ‌కులు. 16వ శతాబ్దానికి చెందిన ఫెని సర్వింగ్ పరికరాలు, ఒక పురాతన చెక్క షాట్ డిస్పెన్సర్, మ్యూజియం లోపల నాలుగు గదులలో వివిధ పాత మట్టి కుండలు ఉన్నాయి. ఫెని గాఢతను కొలవడానికి ఉపయోగించే ‘గర్వ్’ (స్కేల్), అలాగే రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: