సినిమా పరిశ్రమ రోజురోజుకు ముందుకు దూసుకుపోతుంది.. సినిమా చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు, ఖండాలకు వెళ్లడం ఇప్పటి వరకు చూశాం. కానీ, ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేయనున్నారు. ఇందుకోసం ఓ రష్యా యాక్టర్, డైరెక్టర్ మంగళవారం రోజు అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ దేశానికి చెందిన నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలను రష్యన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో స్పెస్‌లోకి తీసుకెళ్లారు కాస్మోనాట్ ఆంటోన్ ష్కా ప్లెరోవ్. రష్యా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకుపోయింది.
కజకిస్థాన్‌లోని బైకనూర్‌లో ఉన్న రష్యన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ సోయెస్ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ అయింది. చాలెంజ్ అనే కొత్త సినిమా చిత్రీకరణ కోసం పెరిసిల్డ్, క్లిమెంకోలు స్పేస్ స్టేషన్‌కు బయలుదేరారు. వాళ్లు 12 రోజుల పాటు స్పేస్ స్టేషన్లోనే గడపనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదకు తీసుకుని వస్తారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి తీసుకున్న శిక్షణ తనకు సవాలని స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కే ముందు నటి పెరెసిల్డ్ తెలిపింది. డైరెక్టర్ షిపెంకో, పెరెసిల్డ్ కలిసి నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణను పొందారు.
స్పేస్‌లో మూవీ షూటింగ్ పై కొందరు తీవ్రంగా విమర్శించారు. అయినా, వాటిని లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్ కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్రను పోషించారు. ఈ విధంగా స్పేస్ స్టేషన్లో సినిమా షూటింగ్ చేయడం వల్ల అక్కడి రష్యన్ కాస్మోనాట్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని రష్యాలోని కొందరు విమర్శిస్తున్నారు. అందులోనూ స్పేస్ స్టేషన్లో అమెరికాతో పోలిస్తే రష్యాకు ఉన్న స్పేస్ తక్కువని చెబుతున్నారు. అందులో షూటింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుందని వాళ్లు అభిప్రాయపడ్డారు. మూడు గంటల పాటు సోయెజ్లో ప్రయాణించి ఈ సినిమా సిబ్బంది అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుతారురు.