హెరాల్డ్ స్మ‌రామీ : ముఖ్య‌మంత్రి ప‌ద‌వికే వ‌న్నె తెచ్చిన టంగుటూరి అంజ‌య్య‌... నేడు వ‌ర్ధంతి

Spyder
టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16, 1919 - అక్టోబరు 19, 1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంజయ్య 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు[1]. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు.

1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రి గా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు.

 అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి. 1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైనది. సెప్టెంబరు 9 2018 న మణెమ్మ హైదరాబాదు లో చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: