స్మరణ : జీ సత్యమూర్తి సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి కారణం..

Divya

జీ సత్యమూర్తి.. అనగానే  ఇటీవల కాలంలో బాగా అందరికీ గుర్తు వచ్చే విషయం ఏమిటంటే , దేవిశ్రీప్రసాద్ నాన్నగారు అని. జీ సత్యమూర్తి రచయిత. స్క్రీన్ రైటర్ మరియు డైలాగులు కూడా రాసేవారు. ఈయన సుమారుగా 90 తెలుగు చిత్రాలకు పైగా రచయితగా పనిచేసి, మంచి గుర్తింపు పొందాడు. ఇక వీరి కుమారులు దేవి శ్రీ ప్రసాద్, సాగర్ లు  మనకు బాగా సుపరిచితులే. అలాగే పద్మిని అనే ఒక కూతురు కూడా కలదు

జీ సత్యమూర్తి 1954 మే 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని వేదురుపక అనే గ్రామంలో జన్మించారు. మొదట రామచంద్రాపురంలో తన డిగ్రీ చదువును ముగించుకున్న  సత్యమూర్తి, ఆ తర్వాత మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి బీ.ఎడ్ పట్టా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సత్యమూర్తి ముందు నుంచి సాహిత్యం మీద మక్కువ ఎక్కువ కారణంగా ఆయన నవల రాయడానికి దారితీసింది.

ఆయన రాసిన తొలి నవల చైతన్యం. ఈ సాహిత్య కథనంతో మొదలైన ఆయన సినీ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో నవలలు, సాహిత్య రచనలు చేశారు. సత్యమూర్తి రాసిన నవలలో భావోద్వేగం వుట్టి పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న కలతోనే 1973 సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు జి సత్యమూర్తి. ఇక్కడ ఆయన మామగారు అయిన ఆదుర్తి సుబ్బారావు మాయదారి మల్లిగాడు చిత్రాన్ని చూడడానికి వచ్చాడు. ఇక రచన పై తనకున్న ఆసక్తిని తెలుసుకున్న సుబ్బారావు ఒక కథను ఇచ్చి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. కానీ సత్యమూర్తి మాత్రం దాన్ని నవలగా రూపొందించాడు. ఇక ఆ నవలను బాగా ఇష్టపడిన సుబ్బారావు సత్యమూర్తికి సినీ ఇండస్ట్రీలో రచయితగా స్థానాన్ని ఏర్పరచారు.

తర్వాత సుమారు 90 చిత్రాలకు రచయితగా పనిచేసిన జీ సత్యమూర్తి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వ్యాధితో బాధపడుతూ 2017 డిసెంబర్ 14వ తేదీన చెన్నైలో మరణించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: