స్మరణ : సీనియర్ నటి అశ్విని ఎలా మరణించింది..?

Divya
సినీ ఇండస్ట్రీలో  హీరోయిన్ లు కొన్ని కొన్ని సినిమాలలో బాగా నటించి, ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయ్యి, అతి తక్కువ కాలంలోనే అందరినీ వదిలి స్వర్గస్తులయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ అశ్విని కూడా ఒకరు. అశ్విని పలు చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఒక మంచి గృహిణిగా అనేక పాత్రలలో నటించి, ఆ పాత్రలకు జీవం పోసిన మరపురాని సీనియర్ హీరోయిన్ అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఈమె సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.


అశ్విని 1967 జూలై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జన్మించింది.ఇక  అలనాటి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన,  అలాగే దర్శకురాలు, గాయని అయిన భానుమతి  దర్శకత్వంలో తెరకెక్కిన "భక్త ధ్రువ మార్కండేయ" అనే చిత్రం ద్వారా అశ్విని బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇక ఈ చిత్రంలో ఈమెకు మంచి మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఆ తర్వాత  1985వ సంవత్సరంలో బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమా ద్వారా హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చింది అశ్విని.


ఇక అంతే కాదు కలియుగ పాండవులు చిత్రంలో కూడా విక్టరీ వెంకటేష్ సరసన నటించి అందరినీ మెప్పించింది. ఇక కేవలం తెలుగు సినీ పరిశ్రమకే తన నటనను అంకితం చేయకుండా.. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా సుమారు 150 చిత్రాలకు పైగా నటించి, ఒక మంచి స్థానాన్ని పది సంవత్సరాల కాలంలోనే సుస్థిరం చేసుకుంది. పూలరంగడు, చూపులు కలిసిన శుభవేళ,  అమెరికా అబ్బాయి, కొడుకు దిద్దిన కాపురం, అరణ్యకాండ, పూలరంగడు, పెళ్లి చేసి చూడు వంటి ఎన్నో చిత్రాలలో నటించింది . అయితే 1980 -  1990 మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అశ్విని, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2012 సంవత్సరం సెప్టెంబర్ 23 అనగా ఆదివారం ఉదయం చెన్నైలో శ్రీ రామచంద్ర హాస్పిటల్ లో మరణించడం జరిగింది.

ఈమెకు పెళ్లి కాలేదు. కానీ ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుతూ ఉండడం కారణం చేత, ఆ బాధ్యతలను తమిళ నటుడు అలాగే దర్శకుడు  పార్తీబన్ చూసుకోసాగాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: