స్మరణ: ఎస్పీ బాలు నటించిన సినిమాలు ఇవే?

VAMSI
ఎస్పీ బాలు నెల్లూరు జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం వలన సంగీతం పట్ల ఆసక్తి కారణంగా ఒక సింగర్ గా మర్యాద రామన్న సినిమాలో మొదటి సారి పాడాడు. ఆ తర్వాత ఇక అనేక సినిమాల్లో పాడుతూ ప్రజలను తన గొంతుకు దాసోహమయ్యేలా చేసుకున్నాడు. కానీ బాలు ఒక గాయకుడు మాత్రమే కాదు. నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కావడం విశేషం. సింగర్ గా కొనసాగుతూనే కొన్ని సినిమాలో కీలక పాత్రలు చేసి ప్రజలను మెప్పించాడు. మరి బాలు నటించిన సినిమాలు ఏవో చూద్దామా. ఈయన నట ప్రస్థానం 1969 నుండి మొదలయింది.

"పెళ్లంటే నూరేళ్ల పంట" అనే చిత్రం మొదటి సినిమా. ఎస్పీ బాలు తెలుగు మరియు తమిళ సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు. ముఖ్యంగా బాలు నటించిన సినిమాలలో ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ లాంటి ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలలో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు.  బాలు మొత్తం కెరీర్ లో కేవలం రెండు సినిమాల్లో మాత్రం హీరోగా చేశాడు. వాటిలో "కేలడి కన్మణి" అనే తమిళ చిత్రంలో రాధిక హీరోయిన్ గా నటించగా బాలు హీరోగా నటించాడు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ కావడంతో తెలుగులో "ఓ పాపా లాలి" అనే పేరుతో డబ్ చేశారు.  

ఆ తర్వాత ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం అనే సినిమాలో బాలు కథానాయకుడిగా చేశారు. ఇందులో బాలు కి జంటగా లక్ష్మి నటించింది. ఇలా ఒక గాయకుడి గానే కాకుండా నటుడిగా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ఆయన అకాల మరణంతో దేశం లోని ఎంతో మంది ప్రజల మనసులు మూగబోయాయి. ఆయనను ఈ విధంగా మరో సారి స్మరించుకునే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: