స్మరణ: శ్రీహరి ఆఖరి కోరిక ఏమిటో తెలుసా ?

VAMSI
తెలుగు సినిమాకు ఎంతో మంది గొప్ప గొప్ప నటీ నటులు తమ సేవలను అందించారు. వీరి నటనకు ప్రేక్షకులు జయ జయ ధ్వానాలు పలికారు. ఒక మంచి నటులుగానే కాకుండా మంచి మనుషులుగా ప్రేక్షకుల చేత గుర్తించబడ్డారు. వారిలో చాలా మంది ఇప్పటికే భూమిపై తమ రుణం తీర్చుకుని ఆ భగవంతుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మన మనసుల్లో కలకాలం గుర్తుండిపోతారు. అటువంటి నటులలో ఒకరే రియల్ స్టార్ శ్రీహరి.
ఇతని జీవితంలో ఎన్నో విషయాలు జరిగాయి. సినిమా పరిశ్రమకు దొరికిన ఒక మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఒక పల్లెటూరు నుండి రియల్ స్టార్ గా ఎదగడం ఇతని కృషి ప్రశంసనీయం.

శ్రీహరి విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన చివరి శ్వాస వరకు నటించాడు. ఎన్నో సినిమాలు విజయాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ప్రేక్షకులు కూడా శ్రీహరి సినిమాలో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఒక భావన ఏర్పడేలా చేశాడు. జీవితంలో అన్నీ సాధించాడు. అన్ని రకాలుగా బాగా స్థిరపడ్డాడు. కానీ ఎంతో కాలం నుండి మనసులో ఉన్న  ఒక కోరిక మాత్రం చి చివరి వరకు తీరకుండానే చనిపోవడం చాలా బాధాకరం. మామూలుగా చిన్నప్పటి నుండి శ్రీహరికి బాడీ ఫిట్నెస్ పై శ్రద్ద చాలా ఎక్కువ. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు సైతం అక్కడ జరిగే బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనే వాడు.


ఆ విధంగా ఏడు సార్లు మిస్టర్ హైదరాబాద్ గా అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా రెండు సార్లు యూనివర్సిటీ తరపున జాతీయ స్థాయి కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజ్ లు గెలుచుకున్నాడు. అయితే శ్రీహరి ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్ లో పాల్గొనాలని కలలు కనే వాడు. కానీ చివరి వరకు ఆ కోరిక తీరలేదు. అలా 2013 లో కాలేయ సంబంధిత వ్యాధితో ముంబై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: