ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమలో అల్లు కుటుంబం గౌరవంగా బ్రతుకుతుంది అంతే దానికి కారణం అల్లు రామలింగయ్య గారు చేసిన కృషి అని చెప్పాలి. చిన్నప్పటి నుండి రామలింగయ్య కు చదువు కాంత బట్టలేదు. అందుకే ఎప్పుడూ స్నేహితులతో కలిసి తిరిగే వాడు. కానీ మనసులో నటనపై ఒక ఇష్టం ఉండేది. ఎప్పటికైనా ఒక నటుడు కావాలని కలలు కంటూ ఉండేవాడు. ఆ విధంగా తొలి సారి ఒక స్టేజ్ పైన బృహస్పతి అనే పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. అలా ఆ తర్వాత చాలా నాటకాల్లో నటించి నటనలో పరిణితి సాధించాడు. అయితే అల్లు రామలింగయ్య నాటకాలను చూసి గరికపాటి రాజారావు తొలి సారిగా పుట్టిల్లు అనే సినిమాలో ఒక మంచి పాత్రను ఇచ్చాడు. ఈ సినిమా 1952 లో విడుదల అయింది.
మొదటి సినిమాతోనే తనకు మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుండి అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్యలో సినిమా రంగంలో ఎన్నో కష్టాలు ఎదుటి వచ్చినా నిలదొక్కుకుని నిలబడ్డాడు. తనకంటూ ఒక మార్క్ ను ఏర్పరుచుకున్నాడు. తన హాస్యంతో ప్రేక్షకులంతా గిలిగింతలు పెట్టాడు. అలా ఒక్కో సినిమా చేసుకుంటూ కామెడీ మరియు విలన్ పాత్రలతో కలిపి 1030 సినిమాలు చేశాడు. పని మీద ఎంత డెడికేషన్ అంటే ఒకానొక సందర్భంలో తన కొడుకు చనిపోయాడని తెలిసి కూడా షూటింగ్ కి వచ్చాడు. ఇన్ని సంవత్సరాల నటనా జీవితంలో ఎన్నో పురస్కారాలు పొందాడు.
అయితే ఇతనికి ఒక్క కోరిక మాత్రం తీరకుండానే చనిపోయాడు. తన నటనా జీవితం పూర్తయ్యే లోపు 1116 సినిమాలలో నటించాలి అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ 31 జూలై 2014 వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈనాటికీ అల్లు రామలింగయ్య హాస్యం ప్రత్యేకం అని చెప్పాలి.