శివారాధన పరమార్థం ఇదే.. తెలుసుకోండి..

హిందువులు ప్రముఖంగా ఆరాధించేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్నే.. అందులో బ్రహ్మ సృష్టి కారుడుగా, ఈశ్వరుడు లయకారుడుగా చెబుతారు. మనం శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి. అసలు శివత్వం వెనుక ఉన్న పరమార్థమేంటి. శివుని ప్రత్యేక రూపం వెనుక దాగి ఉన్న పరమార్థం ఏంటి.. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

శివుని రూపాన్ని గమనిస్తే తలపై గంగమ్మ, చిక్కులుపడిపోయిన జటాజూటం, నుదుట త్రినేత్రం గోచరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నది ఆ శివత్వమే. తలపై గంగమ్మ ఈ భూమిపై ప్రవహించే నదులకు ప్రతీక. శివుని జటాజూటం పర్వతాలు, కొండలను సూచిస్తుంది. శివుని మూడు కన్నులు సూర్యుడు, చంద్రుడు, అగ్నిలకు ప్రతీకలు. 

ఇక శివారాధన విషయానికి వస్తే.. మనసావాచాకర్మణా శివపూజ జరగాలి. ఏకాగ్రతతో శివుణ్ణి ఆరాధించాలి. ఇది చాలా ప్రధానం అందుకే.. మన సాహితీ వాజ్ఞ్మయంలో చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద, చిత్తశుద్ధిలేని శివ పూజలేలరా.. వంటి సామెతలు పుట్టుకొచ్చాయి.  మనసు, మాట, కాయం ఒక్కటే అన్నవిధంగా సాగాలి ఆరాధన. 

శివ పూజ సాధ్యమైనంత ప్రకృతి సహజసిద్ద వస్తువులతో జరగాలి. ప్రకృతిలో లభించే ఆకులు, పువ్వులు, పండ్లతో శివారాధన జరిగితే ఆ త్రినేత్రుడు సంతోషిస్తాడు. వట్టి పూజలేకాదు.. నియమబద్ద, ధర్మ బద్దమైన జీవనం గడపాలి. సకల సుగుణాలతో జీవించడం కూడా శివార్చనలో భాగమే. ఇదే అసలైన శివతత్వసారం, శివ రహస్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: